Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
- CJP నిరసనకు ముందు ఢిల్లీలో రవాణా ఆంక్షలపై సుప్రీంకోర్టు ఆందోళన
- 57 మెట్రో స్టేషన్ల గేట్ల మూసివేతపై చర్చ
- రైళ్ల రద్దు, రోడ్లపై బారికేడ్లనూ సమీక్షించాలని సూచన
- ‘‘ప్రజల రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలగకూడదు’’ అని సీజేఐ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియను రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో భారీ నిరసనకు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మెట్రో రైల్ స్టేషన్లను మూసేయడం, రైలు సేవల్ని రద్దు చేయడం, రహదారులపై ఆంక్షలు విధించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగిన విచారణలో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ.. ప్రజల రాకపోకలను పూర్తిగా అడ్డుకోకూడదని అన్నారు.
మూసివేసిన మెట్రో స్టేషన్ల సంఖ్యను తగ్గించాలని, రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లను సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. సీజేపీ తరుపు వాదించిన కపిల్ సిబల్, ఆంక్షలను సుప్రీంకోర్టు ముందుకు తెచ్చారు. ప్రభుత్వం తరుఫున వాదించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్టేషన్లు మూసేసినట్లు కోర్టుకు తెలిపారు.
Also Read
మెట్రో స్టేషన్లను మూసేయాలన్న నిర్ణయంపై సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. నోయిడా, గురుగ్రామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పని, చదువుల నిమిత్తం ఢిల్లీకి వెళ్తుంటారని పేర్కొన్నారు. మెట్రో సేవల్ని నిషేధించడం ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించొచ్చని అన్నారు. శాంతిభద్రతలు మీ పరిధిలోని విషయం, కానీ ప్రయాణించే పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని అన్నారు. ఒక వేళ నిరసనల్లో సంఘవిద్రోహ, దేశ వ్యతిరేక శక్తులు పాల్గొంటాయని లేదా పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తే తగిన చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సీజేపీ నిబంధల్ని ఉల్లంఘించిన విషయం కోర్టు ముందుకు..
గతంలో నిరసనకారులు పార్లమెంట్ వరకు వెళ్లాలని కోరుకున్నారని. పార్లమెంట్ ఒక రాజకీయ భవనం కాదని, అది దేశ సార్వభౌమధికారానికి ప్రతీక అని ప్రభుత్వ వైఖరిని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. గతంలో సీజేపీ పరిమిత కాలానికి అనుమతి తీసుకుని, సమయం దాటి నిరసన కొనసాగించిన విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లారు. గతంలో హింసాత్మక నిరసనల్లో 200 మంది పోలీసులు గాయపడిన విషయాన్ని తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు. మహిళా పోలీసుల్ని వేధించారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు