Site icon NTV Telugu

Supreme Court: బిల్లులపై రాష్ట్రపతికి డెడ్‌లైన్ విధించవచ్చా?, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

Supremecourt

Supremecourt

చట్టసభల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి పెండింగ్‌లో పెడుతున్నారు. దీంతో ఈ వివాదం బాగా ముదురుతోంది. ఇటీవల తమిళనాడు గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇలాంటి రగడే జరిగింది. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తమిళనాడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నిర్దిష్ట గడువులోగా ఆమోదించకపోతే.. ఆ బిల్లులు ఆమోదం పొందినట్లేనని స్పష్టం చేసింది. తాజాగా ఇదే అంశంపై మంగళవారం సుప్రీకోర్టు విచారణ చేపట్టింది.

ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా ఆమోదించిన రాష్ట్రపతి

చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు నిర్దేశించవచ్చా అనే అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఈ విచారణను చేపట్టింది. వచ్చే మంగళవారం నాటికి దీనిపై స్పందన తెలియజేయాలని సూచించింది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, దేశానికి సంబంధించిన విషయమని గమనించాలని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Asim Munir: అసిమ్ మునీర్.. మరో ముషారఫ్ కానున్నారా?.. పాక్‌లో ఏం జరుగుతోంది?

Exit mobile version