Supreme Court: డ్రగ్స్ కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద నమోదైన కేసులో నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిందితుడి తరుఫున వాదించిన న్యాయవాది.. సదరు వ్యక్తి సమాజానికి గణనీయమైన ప్రమాదం కలిగించలేదని, అతడి అరెస్ట్ అనవసరమని సుప్రీంకోర్టుకు వెల్లడించారు.
Read Also: Hyundai Cars Price: హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. ఈనెల 31 వరకే అవకాశం!
అయితే, ఈ కేసును విచారించిన జస్టిస్ బేలా త్రివేది, జస్టిన్ సతీస్ చంద్రలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, నిందితుడి వాదనల్ని విశ్వసించలేదు. ఈ సమయంలో న్యాయమూర్తులు ప్రముఖ వెబ్‌సిరీస్‌లు అయిన ‘‘నార్కోస్’’, ‘‘బ్రేకింగ్ బాడ్’’ని ఉదహరించారు. ‘‘నువ్వు నార్కోస్‌ని చూశావా..? చాలా బలమైన సిండికేట్. అరుదుగా పట్టుబడ్డాడు. నేను మీకు మరొకటి చెబుతాను, ‘బ్రేకింగ్ బాడ్’ తప్పక చూడండి. మీరు ఈ వ్యక్తులతో పోరాడలేరు. వారు ఈ దేశంలోని యువతను చంపుతున్నారు’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
‘నార్కోస్’ ప్రపంచంలో అత్యంత క్రూరమైన డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్‌కి చెందిన మెడెలిన్ కార్టెల్ ఎదుగుదల, పతనం గురించి, ఎస్కోబార్ నిజజీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈ వెబ్‌సిరీస్‌లో డ్రగ్స్ కార్టెల్స్ దారుమైన వ్యూహాలు, అవి చేసే విధ్వంసాన్ని ఈ సిరీస్‌లో చూడొచ్చు. ‘‘బ్రేకింగ్ బాడ్’’ అనేది మెథాంఫేటమిన్ కింగ్‌పిన్‌గా మారిన హైస్కూల్ కెమిస్ట్రీ టీచర్ వాల్టర్ వైట్‌కి సంబంధించినప స్టోరీ. డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్న ప్రమాదకరమైన వ్యక్తులు గురించి, వారి స్వభావాల గురించి ఈ సిరీస్ వివరింస్తుంది.