Deepam Row: విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. సీఎస్, డీజీపీ సహా 15 మందికి ధిక్కరణ నోటీసులు!
- విజయ్ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాక్..
- తిరుప్పరంకుండ్రం దీప వివాదంపై సుప్రీంకోర్టు ఫైర్..
- ఆలయ ట్రస్టీల సస్పెండ్, సీఆర్పీఎఫ్ చేతికి కొండ భద్రత..
- సీఎస్, డీజీపీతో సహా 15 మందికి ధిక్కార నోటీసులు..
- శనివారం దీపం వెలిగించాల్సిందే అని తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepam Row: తమిళనాడులోని తిరుపరంకుండ్రం దీపత్తూన్ దీపం వివాదంలో విజయ్ సర్కార్ చిక్కుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కొండపై ఉన్న దీపతూన్ (దీప స్తంభం) వద్ద కార్తీక దీపం వెలిగించలేదు. దీనిపై శుక్రవారం విచారించిన అత్యున్నత ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని అధికారులు, మదురై కలెక్టర్, ఆలయ ట్రస్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు ముఖ్యకార్యదర్శి, డీజీపీ సహా 15 మంది సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసి, ఇద్దరు మాజీ న్యాయమూర్తులను ఆలయ ట్రస్టీ రిసీవర్లుగా నియమించింది.
తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని అధికారుల్ని సుప్రీంకోర్టు ఆదేశించిందిన నోటీసులు అందుకున్నవారిలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ), హిందూ మత ధర్మాదాయ శాఖ (HR&CE) కార్యదర్శి, కమిషనర్, మధురై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, పోలీస్ సూపరింటెండెంట్, ఆలయ అధికారులు తదితరులు ఉన్నారు. నోటీసులకు జారీ చేసిన మూడు రోజుల్లోగా సంబంధిత వ్యక్తులందరికీ వ్యక్తిగతంగా అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ను కోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో నోటీసులు అందుకున్న వారు కారణాలు వివరించాలని స్పష్టం చేసింది.
Also Read
- Supreme Court: రేపు దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాల్సిందే.. ఆలయ ట్రస్టీలపై సుప్రీంకోర్టు వేటు!
- Deepam Row: దీపం ఎందుకు వెలిగించలేదు? మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఫైర్!
- Lok Sabha Seats Increase: కేంద్రం కీలక నిర్ణయం..! లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు.. 2051 వరకు డీలిమిటేషన్ ఫ్రీజ్!
- MK Stalin: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన స్టాలిన్..
శనివారం దీపతూన్ వద్ద దీపం వెలిగించాలని శుక్రవారం మరోసారి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు పోలీసులు తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యారని పేర్కొంటూ తిరుప్పరంకుండ్రం ఆలయం, కొండ ప్రాంత భద్రతను సీఆర్పీఎఫ్కు సుప్రీంకోర్టు అప్పగించింది. కొండపై ఆలయం, దర్గా రెండింటి కార్యకలాపాలు ప్రశాంతంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Deepam Row: విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. సీఎస్, డీజీపీ సహా 15 మందికి ధిక్కరణ నోటీసులు!
-
Sumalatha : బాలయ్యపై వ్యాఖ్యలకు జానీ మాస్టర్ భార్య క్షమాపణలు..
-
Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక నిర్ణయం.. PPP విధానంలో అప్పగింత..!
-
Supreme Court: రేపు దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాల్సిందే.. ఆలయ ట్రస్టీలపై సుప్రీంకోర్టు వేటు!
-
January 12 Vidudala: సినిమా అంతా బ్లాక్‌బస్టర్ కళ ఉట్టిపడుతోంది.. ఆ సినిమాపై జీవీ ప్రకాశ్ సెన్సేషనల్ రివ్యూ!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!