Site icon NTV Telugu

Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

Nimisha Priya

Nimisha Priya

కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ కీలక సమాచారాన్ని అందించారు. యెమెన్‌లో ప్రస్తుతం భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష నిలిపివేయబడిందని.. ప్రతికూలంగా ఏమీ జరగలేదని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు. ఈ విషయంలో కొత్త మధ్యవర్తి రంగంలోకి దిగారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: కోస్ట్‌గార్డ్స్‌తో కలిసి దీపావళి జరుపుకోనున్న మోడీ.. ఎక్కడంటే..!

నర్సు నిమిషా ప్రియను రక్షించడానికి దౌత్య మార్గాలను ఉపయోగించేందుకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా నిమిషా ప్రియ ఉరిశిక్ష ఏమైందని ప్రశ్నించగా.. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సమాధానం ఇస్తూ.. నిమిషా ప్రియ ఉరిశిక్ష ప్రస్తుతం నిలిచిపోయిందని.. ఎటువంటి ప్రతికూల సంఘటనలు జరగడం లేదని గురువారం సుప్రీంకోర్టుకు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి: CJI Gavai: గవాయ్‌పై దాడి ఘటనలో కీలక పరిణామం.. న్యాయవాదిపై చర్యలకు ఏజీ ఆమోదం

నిమిషా ప్రియ 2008లో యెమెన్‌కు వెళ్లి అక్కడ నర్సుగా పనిచేసింది. తలాల్ అబ్డో సాయంతో క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. తలాల్.. నర్సును వేధించడం ప్రారంభించాడని నిమిషా న్యాయవాది చెప్పారు. తప్పించుకోవడానికి నిమిషా.. తలాల్‌కు డ్రగ్స్ ఇచ్చింది. ఇది అతని మరణానికి దారితీసింది. ఈ కేసులో ఆగస్టులో ఆమె ఉరిశిక్ష పడింది. దౌత్యం కారణంగా ప్రస్తుతం ఆమెకు ఉరిశిక్ష నిలిపివేయబడింది.

Exit mobile version