NTV Telugu Site icon

Supreme Court: సుప్రీంకోర్టు ముందుకు నేడు 220 పిల్స్

Supreme Court Min

Supreme Court Min

Supreme Court: సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ సారథ్యంలో ధర్మాసనం ముందుకు నేడు 220 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణకు రానున్నాయి. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లతో సహా 220 పిల్‌లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ చట్టం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారి తీసింది. జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌ సభ్యుడిగా ఉన్న ఈ ధర్మాసనం ‘ఇండియన్‌ యూనియన్‌ ఆఫ్‌ ముస్లింలీగ్‌’ సీఏఏకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషనుతోపాటు పై పిల్స్‌ అన్నింటిపై వాదనలు వింటుందని సుప్రీంకోర్టు వెబ్‌సైటులో పేర్కొన్నారు.

Asia Cup 2022: ఆరో సారి ఆసియా కప్ విజేతగా శ్రీలంక… ఫైనల్‌లో పాక్‌ చిత్తు

గత రెండేళ్లుగా పెండింగులో ఉన్న పలు పిటిషన్లు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గృహహింస చట్టం పరిధిలో బాధితులుగా మారుతున్న మహిళల రక్షణకు తగిన స్థాయిలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోరుతూ ‘వుయ్‌ ది ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థ దాఖలు చేసిన పిల్‌ కూడా విచారణకు రానుంది. 15 ఏళ్ల క్రితం చట్టం చేసినప్పటికీ భారతదేశంలో మహిళలపై గృహ హింస అత్యంత సాధారణ నేరంగా కొనసాగుతోందని పిటిషన్ పేర్కొంది.