NTV Telugu Site icon

Asaram Bapu: అత్యాచార దోషి ఆశారాం బాపునకు మధ్యంతర బెయిల్

Asharam Babpu

Asharam Babpu

Asaram Bapu: 2013 అత్యాచారం కేసులో జీవిత శిక్ష అనుభవిస్తున్న ఆశారాం బాపుకు వైద్యపరమైన కారణాలతో మార్చి 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆశారాం బాపు గుండె జబ్బుతో పాటు వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం ఆశారం బాపు జోధ్‌పూర్‌లోని ఆరోగ్య వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.

Read Also: Chunavi Muslim: అమిత్ షాను చునావి ముస్లింగా అభివర్ణించిన ఆమ్ ఆద్మీ పార్టీ..

అయితే, ఆశారాం బాపునకు బెయిల్‌ సమయంలో భద్రతా సిబ్బందిని నియమించి పర్యవేక్షణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, తన ఆశ్రమంలో అనేక సందర్భాల్లో ఒక మహిళా శిష్యురాలిపై అత్యాచారం చేసిన కేసులో ఆశారాం బాపును దోషిగా నిర్ధారించిన జోధ్‌పూర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతడు ఇప్పటికే 11 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించినట్లు తన పిటిషన్ లో పేర్కొన్నాడు. అలాగే, వరుసగా గుండెపోటుకు గురయ్యానని తెలిపాడు. దీంతో ఫిబ్రవరి 2024లో, అతనికి తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించారు.

Show comments