Site icon NTV Telugu

Supreme Court: ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌కు ఊరట.. బెయిల్ మంజూర్

Alikhanmahmudabad

Alikhanmahmudabad

హర్యానా అశోక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆపరేషన్ సిందూర్‌పై సోషల్ మీడియాలో ఉద్రిక్తతలు కలిగించేలా పోస్టులు పెట్టారు. దీంతో ఆయనపై కేసు నమోదు కావడంతో ఆదివారం ఢిల్లీలో హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా బుధవారం మధ్యంతర బెయిల్ లభించింది. అయితే ఇకపై ఆన్‌లైన్‌లో ఎలాంటి వ్యాసాలు గానీ.. పోస్టులు గానీ పెట్టొద్దని.. ఎలాంటి ప్రసంగాలు చేయొద్దని సూచించింది.

ఇది కూడా చదవండి: MP Mithun Reddy: అరాచక పాలన.. భయపెట్టి పాలించడం మూర్ఖత్వం..!

ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉన్నప్పటికీ ప్రొఫెసర్ ప్రకటనలు మాత్రం కుక్క ఈలలు అని పిలువబడే దానికి సమానం అని ధర్మాసనం పేర్కొంది. ప్రొఫెసర్ ఉపయోగించిన పదాలు ఇతరులను అవమానించడానికి, అసౌకర్యాన్ని కలిగించడానికి ఉపయోగించబడ్డాయని అభిప్రాయపడింది. మహ్మదాబాద్‌పై కేసును దర్యాప్తు చేయడానికి ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని హర్యానా డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Balagam : బలగం సినిమా రిపీట్.. 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచి అన్నదమ్ములు..

సోషల్ మీడియా పోస్టులో మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు గురించి ఆయన వ్యాఖ్యానించారు. ఈ పోస్టు విమర్శలకు దారి తీసింది. హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా తప్పుపట్టింది. దీంతో మే 12న నోటీసు జారీ చేసింది. ప్రొఫెసర్ వ్యా్ఖ్యలు మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీస్తాయని పేర్కొన్నారు.

Exit mobile version