Site icon NTV Telugu

Supreme Court: బీహార్ SIRపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court2

Supreme Court2

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ప్రతిపక్షాల తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల వేదికగా విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. ఇక కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటర్ యాత్ర చేపట్టారు. బీహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగించడంపై ఇండియా కూటమి పోరాటం చేస్తోంది. అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం పని చేస్తోందని ఆరోపిస్తోంది.

ఇది కూడా చదవండి: DK Shivakumar: అసెంబ్లీలో డీకే.శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాలాపన.. బీజేపీ నేతలు చిరునవ్వులు.. దేనికి సంకేతం

తాజాగా ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. బీహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో ఓటర్లు సమర్పించే 11 పత్రాల్లో ఆధార్‌ను కూడా చేర్చాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు తెలిపింది. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో తొలగించబడిన ఓటర్ల పేర్లను సరిదిద్దడానికి రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక బూత్-లెవల్ ఏజెంట్లకు స్థానికుల గురించి అవగాహన ఉంటుందని అభిప్రాయపడింది. వలసదారుడు ఎవరో.. స్థానికుడెవరో వారికి బాగా తెలుస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: Putin: ఆ 3 కండీషన్స్ ఒప్పుకుంటేనే శాంతి చర్చలు.. తేల్చి చెప్పిన పుతిన్!

గురువారం బీహార్ ఓటర్ల జాబితాల సవరణపై నివేదికను ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ముందు ఉంచింది. ప్రత్యేక సర్వే తర్వాత 65 లక్షల ఓట్లను తొలగించినట్లు తెలిపింది. అయితే ఈ డేటాను ఆన్‌లైన్‌లో పొందిపరచాలని సూచించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి బెంచ్ ఆగస్టు 19 వరకు గడువు విధించింది. ఇక పౌరులు తమ ఆధార్ కార్డు కాపీ దరఖాస్తులో పెట్టొచ్చని స్పష్టంగా ఈసీ తెలియజేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో రాష్ట్ర స్థాయి జాబితాను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపింది.

అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్‌లో తుది ఓటర్ జాబితా విడుదల చేయనుంది. అనంతరం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందుకోసం ఈసీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Exit mobile version