మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించేలా ఆదేశించాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. విజయ్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్‌ను జూలై 28 సుప్రీంకోర్టు తిరస్కరించింది. సోమవారం విచారించిన సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్ కొట్టేసింది. దీంతో మంత్రి విజయ్ షాకు భారీ ఉపశమనం లభించింది.
ఇది కూడా చదవండి: Pahalgam Terrorists: పహల్గామ్ ఉగ్రవాదులు హతం.. వెలుగులోకి ఫొటోలు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారతప్రభుత్వం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. కల్నల్ సోఫియా ఖురేషి నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టింది. ఎప్పటి కప్పుడు ఆపరేషన్ విజయాలను మీడియాకు తెలియజేస్తూ ఉండేది. దీంతో ఆమె బాగా పాపులర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Suleman Musa: పహల్గామ్ సూత్రధారి సులేమాన్ మూసా హతం.. అసలు ఇతడెవరు?
అయితే ఒక సభలో మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మాట్లాడుతూ.. మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచిన ఉగ్రవాదులను అంతం చేయడానికి అదే ఉగ్రవాదలు మతానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషిని భారతప్రభుత్వం పాకిస్థాన్‌పైకి పంపించిందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపాయి. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. అంతేకాకుండా మధ్యప్రదేశ్ హైకోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టింది. అంతేకాకుండా సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పరిణామాల నేపథ్యంలో విజయ్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పారు.
ఇది కూడా చదవండి: Rajnath Singh: ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు బుద్ధి చెప్పాం
ఇక పహల్గామ్‌లో మారణహోమం సృష్టించిన ముగ్గురు ఉగ్రవాదుల్ని శ్రీనగర్‌లో సోమవారం భారత సైన్యం హతమార్చింది. కీలక సూత్రధారి సులేమాన్ మూసా సహా మరో ఇద్దరు ముష్కరులు కుక్క చావు చచ్చారు. సోమవారం ఉదయం ఆపరేషన్ మహాదేవ్ ఆపరేషన్ చేపట్టింది. సంచార జాతుల వారు ఇచ్చిన పక్కా సమాచారంతో సైన్యం ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది.
