NTV Telugu Site icon

Supreme court: యూనివర్సిటీల్లో కుల వివక్ష.. యూజీసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Sc

Sc

Supreme Court: కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిని అరికట్టేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించాలని చెప్పుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులపై కుల వివక్షను రూపుమాపేందుకు ముసాయిదాను రెడీ చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించడానికి సిద్ధం చేసిన 2012 రూల్స్ ప్రకారం.. ఎన్ని ఈక్వల్ అపార్చునిటీ యూనిట్స్ స్థాపించారో డేటా అందజేయాలని పేర్కొనింది. ఈ సమస్యపై మాకు పూర్తి అవగాహన ఉంది.. దీనిపై ఏదో ఒకటి చేస్తామన్నారు.

Read Also: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఆట మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు

అలాగే, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టు కోరింది. అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షకు సంబంధించిన కంప్లైంట్స్, తీసుకున్న చర్యల గురించి ఆరు వారాల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని యూజీసీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై 2019లోనే పిటిషన్ దాఖలైందని.. కానీ ఇప్పటి వరకు సరైన విచారణ జరగలేదని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఈ పిటిషన్‌ను క్రమం తప్పకుండా లిస్ట్ చేస్తామని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అయితే, 2004 నుంచి ఐఐటీ, ఇతర విద్యాసంస్థల్లో 50 మందికి పైగా స్టూడెంట్స్ కుల వివక్ష కారణంగా సూసైడ్ లకు పాల్పడ్డారని సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ న్యాయస్థానానికి తెలిపారు. ఈ విద్యార్థులలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారే ఉన్నారని చెప్పుకొచ్చారు. గతంలో విశ్వవిద్యాలయాల్లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు రోహిత్ వేముల, పాయల్ తాడ్వీల తరపున జైసింగ్ కోర్టులో వాదనలు వినిపించారు.

Show comments