Site icon NTV Telugu

Babri Masjid Demolition Case: బాబ్రీ కేసులో అన్ని ధిక్కార పిటిషన్లను క్లోజ్ చేసిన సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court

Supreme Court Closes Contempt Proceedings In Babri Masjid Demolition Case: బాబ్రీ మసీద్ కేసులో ధిక్కార పిటిషన్లపై కీలక తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో దాఖలైన అన్ని కోర్టు ధిక్కరణ కేసులను ముగించింది సుప్రీం ధర్మాసనం. 1992లో అయోధ్యంలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, బీజేపీ నాయకులపై నమోదు అయిన ధిక్కరణ పిటిషన్లను క్లోజ్ చేసింది. జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం.. బాబ్రీ మసీదు కేసు ప్రస్తుతం మనుగడలో లేదని నవంబర్ 2019 తీర్పును ప్రస్తావించింది.

జస్టిస్ ఎస్కే కౌల్, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్ నాథ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బాబ్రీ కేసులో నమోదైన ధిక్కరణ పిటిషన్లపై కీలక తీర్పును వెల్లడించింది. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను 1992లో మహ్మద్ అస్లాం బూరే దాఖలు చేశారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించిందని ఉత్తర్ ప్రదేశ్ గవర్నమెంట్ పై కేసు దాఖలు చేశారు.

Read Also: Minister KTR: మరోసారి కరోనా బారిన పడ్డ కేటీఆర్

అయితే నవంబర్ 9, 2019లో అయోధ్య కేసుపై ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో తుది తీర్పు రావడంతో ధిక్కార పిటిషన్ మనుగడలో లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ధిక్కార పిటిషన్ దాఖలు చేసి 30 ఏళ్లు గడుస్తోంది. పిటిషన్ వేసిన వ్యక్తి కూడా చనిపోయిన విషయాన్ని న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ప్రస్తుతం బాబ్రీ మసీదు వివాదం మనుగడలో లేదు.. మీరు చనిపోయిన గుర్రాన్ని కొరడాతో కొట్టలేరని జస్టిస్ ఎస్కే కౌల్ వ్యాఖ్యానించారు.

Exit mobile version