Supreme Court: ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు.?.. బెంగాల్ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని సీఎస్‌పై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పశ్చిమ బెంగాల్ మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా బెంగాల్ అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేుసింది. ఈ ఘటన విచారణ సందర్భంగా కోర్టు బెంగాల్ సీఎస్‌ను నేరుగా ప్రశ్నిస్తూ.. ‘‘మీరు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు..? మీరు అంత గొప్పవారని అనుకోకండి, మిమ్మల్ని మీరు పెద్దగా ఊహించుకోకండి’’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో ఒక మహిళా న్యాయమూర్తిని అడ్డుకోవడం, బెదిరించడం వంటి తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళా జడ్జి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోర్టు సీరియస్‌గా వ్యవహరించింది.
ఎన్ఐఏ ఈ ఘటనను దర్యాప్తు చేస్తోంది. విచారణకు సంబంధించిన విషయాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇందులో న్యాయాధికారులను అడ్డుకోవడం, దాడి చేయడం, పోలీసులు నిర్లక్ష్యం వంటి అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేయగా, 300 మందికి పైగా అనుమానితుల్ని గుర్తించారు. కోర్టు ఈ ఘటనలో తన ప్రత్యేక అధికారాల కింద ఆర్టికల్ 142ను ఉపయోగించింది. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది.
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
Read Also: Instagram Subscription Trend: సబ్‌స్క్రైబర్లకు మాత్రమే.. ఇలా బరితెగిస్తే ఎలా?
రాష్ట్ర యంత్రాంగం పనితీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమయానికి స్పందించి ఉంటే, పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని కోర్టు అభిప్రాయపడింది. సీఎస్ తనకు ఫోన్ రాలేదని, తాను ఢిల్లీలో సమావేశంలో ఉన్నానని చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి మిమ్మల్ని సంప్రదించలేనంత స్థాయిలో మీరు లేరంటూ మందలించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పాలని సూచించింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా విచారణకు వచ్చిన న్యాయాధికారుల్ని కొంత మంది దిగ్బంధించారు. ఈ ఘటనలో ఎంఐఎం నేత కీలక పాత్ర పోషించినట్లు తేలింది. అతడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన బెంగాల్‌లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తేవాలని బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన నుంచి అధికారాలను ఎన్నికల సంఘం లాగేసుకుందని విచిత్ర వాదన తీసుకువచ్చారు.
తాజావార్తలు
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?