Site icon NTV Telugu

Arvind Kejriwal: ఇండియా కూటమి ర్యాలీలో ఆప్ ‘ 6 హమీలు’.. బీజేపీపై కేజ్రీవాల్ భార్య ఫైర్..

Sunita Kejriwal

Sunita Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎంకే కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ రోజు ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ని టార్గెట్ చేసుకుంటూ విరుచుకుపడ్డారు. ఈ ర్యాలీకి రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, మెహబూబా ముఫ్తీ, మల్లికార్జున్ ఖర్గే సహా ప్రతిపక్షాల నేతలు పాల్గొన్నారు. సునితా కేజ్రీవాల్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ కూడా హాజరయ్యారు.

భారత ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌కి అండగా నిలుస్తారని, ఆయనను ఎప్పటికీ జైలులో ఉంచలేరని ఆమె అన్నారు. ‘‘నేను మీ నుంచి ఓట్లు అడగడం లేదు, ఒకరిని ఓడించేందుకు సాయం చేయాలని 140 కోట్ల మంది భారతీయులను మాత్రమే అడుగుతున్నాను’’ అని జైలు నుంచి తన భర్త సందేశాన్ని సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. ఇండియా కూటమికి ఆమె మద్దతు ఇస్తూ.. ఇది పేరుకు మాత్రమే ఇండియా కాని,మా హృదయాల్లో భారత్ ఉందని అన్నారు.

Read Also: PM Modi: కీలమైన ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన కాంగ్రెస్.. ఆ పార్టీని నమ్మలేం..

కేజ్రీవాల్ 6 హామీలు:

దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉండవు. రెండోది దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత విద్యుత్. మూడోది ప్రతీ గ్రామంలో సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు నాణ్యమైన విద్యను పొందే ఒక మంచి పాఠశాల. నాల్గవది, ప్రతి ఒక్కటి. గ్రామంలో మొహల్లా క్లినిక్ ఉంటుంది, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంటుంది.ఐదవది, స్వామినాథన్ నివేదిక ప్రకారం రైతులకు మంచి కనీస మద్దతు ధర లభిస్తుంది, ఆరవది, ఢిల్లీ ప్రజలు చాలా సంవత్సరాలుగా అన్యాయానికి గురవుతున్నారు. ఢిల్లీ ప్రజలకు రాష్ట్ర హోదా లభిస్తుంది అని సునీతా కేజ్రీవాల్ చెప్పారు.

Exit mobile version