అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్ జైల్లో మగ్గుతున్నాడు. గత కొద్ది రోజుల్లో జైలు జీవితం అనుభవిస్తున్నాడు. అయితే అతనికి జైలు ఆహారం పడటం లేదని వాపోయాడు. జైలు ఆహారంతో భారీగా బరువు తగ్గడంతో పాటు డయేరియా వంటి సమస్యలు వస్తున్నాయని.. తనకు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ కర్ణాటక హైకోర్టులో దర్శన్ పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్‌లో ఓ మంచం, పుస్తకాలు కూడా కావాలని దర్శన్ అభ్యర్థించాడు. జస్టిస్ ఎస్‌ఆర్ కృష్ణకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. విచారణ ఖైదీలకు, దోషులకు జైలు నిబంధనలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. ఈ విషయంలో ఇతర కోర్టులు ఇచ్చిన ఆదేశాలను తెలియజేయాలని కోరింది.
ఇది కూడా చదవండి: Dubai: దుబాయ్‌లో దారుణం.. భారతీయుడ్ని చంపిన పాకిస్థానీయులు
జైల్లో ఇచ్చే ఉప్మా, అన్నం, సాంబారు, రాగిముద్ద, మజ్జిగ వంటివి సరిపోవడం లేదని, తన బరువు గణనీయంగా తగ్గిపోతోందని దర్శన్ వాపోయాడు. దర్శన్‌కు నిత్యం మాంసాహారం తీసుకోవడం అలవాటు ఉందని, కారాగారంలో వారంలో రెండు రోజుల మాత్రమే మాంసాహారాన్ని ఇవ్వడం, అదీ పరిమితిలో ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అతని భార్య విజయలక్ష్మి తెలియజేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana DGP Jitender: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్