Site icon NTV Telugu

B Sudershan Reddy: ప్రతిపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి నామినేషన్

Sudershan Reddy

Sudershan Reddy

ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక నామినేషన్ సమయంలో సుదర్శన్‌రెడ్డి వెంట సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, శరద్ పవార్ సహా పలువురు ఎంపీలు హాజరయ్యారు. సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు.

ఇది కూడా చదవండి: Kerala: మలయాళ నటికి యువ నాయకుడు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో బాధితురాలు ఆవేదన

ఇక నామినేషన్‌కు ముందు సుదర్శన్‌రెడ్డి పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించారు. ఇక సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అదేరోజు కౌంటింగ్ జరగనుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఉంది.

ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలో దారుణం.. ప్రేమ తిరస్కరించిందని స్నేహితురాలు హత్య

ఇక బుధవారం ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ.రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాధాకృష్ణన్‌ తమిళనాడు వ్యక్తికాగా.. సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ప్రాంత వాసి. ఇద్దరూ కూడా దక్షిణాది వ్యక్తులు కావడం విశేషం.

జూలై 21న జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్యంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.

 

Exit mobile version