Site icon NTV Telugu

KCR Birthday: పూరీ జగన్నాథుడి చెంత.. ‘సైకత’ శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్‌ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు పుట్టిన రోజు సందర్భంగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు సెలబ్రేషన్స్‌ నిర్వహించాలన్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుతూ.. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ కేసీఆర్‌పై ఉన్న అభిమాన్నా చాటుకుంటూ.. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక, పూరీ జగన్నాథుడి చెంత సముద్ర తీరంలో పద్మ శ్రీ సుదర్శన్ పట్నాయక్ ‘సైకత’ శిల్పాన్ని రూపొందించి గులాబీ బాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: AP COVID 19: ఈ రోజు ఎన్నికేసులంటే..?

సిద్దిపేటకు చెందిన వంగ రాజేశ్వర్ రెడ్డి సమన్వయంతో సైకత శిల్పాన్ని రూపొందించారు పద్మ శ్రీ సుదర్శన్ పట్నాయక్… ఒడిశాలో సీఎం కేసీఆర్ సైకత శిల్పాన్ని తయారు చేశారు.. The Fighter, Administrator & The Visionary ( పోరాట యోధుడు, పరిపాలకుడు, దూరదృష్టి గల నేత – హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్) అని రాసి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఇప్పటివరకు ముఖ్యమంత్రుల్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైకత శిల్పాన్ని మాత్రమే రూపొందించిన సుదర్శన్ పట్నాయక్.. ఇప్పుడు తెలంగాణ సారధి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సరికొత్తగా శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలో కొలువైన పూరీ జగన్నాథుడి చెంత, పూరీ బీచ్‌లో సీఎం కేసీఆర్ భారీ సైకత శిల్పాన్ని రూపొందించి.. పోరాట యోధుడు, పరిపాలకుడు, దూరదృష్టి గల నేత.. హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్ అంటూ రాసి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన సీఎం కేసీఆర్ సైకత చిత్రాన్ని పూరీ బీచ్ వద్ద పర్యాటకులు ఆసక్తికరంగా గమనిస్తున్నారు.. ఇక, ఆ వీడియో, ఫొటోలు.. సోషల్‌ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తున్నాయి..

Exit mobile version