బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి
పక్కదేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఖండించడం లేదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. చైనా లద్దాక్‌ను ఆక్రమించడానికి వచ్చినప్పుడు దూకుడు ప్రదర్శించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తుందో చెప్పాలన్నారు.ఆప్ఘన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్నారన్నారు. బంగ్లా మరో ఆప్ఘాన్ కాకముందే భారత ప్రభుత్వం స్పందించి బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువుల హక్కులను కాపాడాలన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్వంత పార్టీ ఎంపీ కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
హిందువులపై దాడులను బీజేపీ ఎందుకు ఖండించడం లేదు
