Students mass hysteria: విద్యార్థుల వింత ప్రవర్తన.. స్కూల్‌లోనే పూనకాలు, అరుపులు, కేకలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉన్నట్టుండి స్కూల్‌లోనే కొందరు విద్యార్థులు వింతగా ప్రవర్తించారు.. పూనకం వచ్చినవారిలా కొందరు ఊగిపోతే.. మరికొందరు అరుపులు, కేకలతో హల్‌చల్ చేశారు.. విద్యార్థుల విచిత్ర ప్రవర్తనతో ఆందోళనకు గురైన టీచర్లు.. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.. అంతటితో ఆగలేదు.. దుష్ట శక్తులు ఆవహించాయంటూ.. కొందరు పెద్దలతో దిష్టి తీయించారు.. మొత్తంగా స్కూల్‌లో విద్యార్థుల వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది.. ఈ వ్యవహారం.. స్కూల్, విద్యాశాఖలో కలకలం సృష్టించింది.. ఉత్తరాఖండ్‌లోని భగేశ్వర్ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భగేశ్వర్‌లోని మారుమూల రైఖులీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు. మంగళవారం రోజు కొంతమంది బాలికలు, ఓ విద్యార్థి విలక్షణంగా ప్రవర్తించారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జాతీయ ఛానెల్‌కు చెందిన ఓ జర్నలిస్ట్.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది..
Read Also: Actress Harassment: సహజీవనం చేస్తేనే డబ్బులిస్తా.. లేకపోతే..
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ఇక, ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్… వెంటనే డాక్టర్ల బృందాన్ని పంపించింది. వింత ప్రవర్తనను మాస్ హిస్టీరియాగా వైద్యులు చెబుతున్నారు.. ఈ ఘటన విద్యాశాఖను ఉలిక్కిపడేలా చేసింది. సంబంధిత ఘటనపై ప్రధాన ఉపాధ్యాయురాలు విమ్లా దేవి మాట్లాడుతూ.. ఈ మంగళవారం కొంతమంది బాలికలు, ఒక అబ్బాయి వింతగా ప్రవర్తించారు.. స్కూల్ ఆవరణలో ఇలా జరగడం ఇదే తొలిసారి అన్నారు.. ఆ సమయంలో వారు ఏడ్చారు, అరిచారు, వణికిపోయారు.. ఎలాంటి కారణం లేకుండా తలలు కొట్టుకున్నారు.. వెంటనే మేం తల్లిదండ్రులను పిలిపించాం.. వారు స్థానిక పూజారిని పిలిపించి దిష్టి తీయించారని.. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు.. గురువారం మరోసారి అదే పునరావృతమైందని చెప్పారు..
విద్యాశాఖ అధికారులతో పాటు.. వైద్యులు కూడా ఇక్కడ ఉన్నప్పుడు.. కొంతమంది విద్యార్థులు అదే విధంగా ప్రవర్తించారని తెలిపారు హెచ్ఎం.. పాఠశాల ఆవరణలోనే పూజ చేయాలని తల్లిదండ్రులు పట్టుబట్టారని.. పాఠశాల నాశనమైందని వారు అంటున్నారని తెలిపారు.. మేం వైద్యులను సంప్రదించడం లేదా పూజారులను సంప్రదించిన తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. అయితే, ఇది ‘మాస్ హిస్టీరియా’ కేసుగా భావిస్తున్నామని తెలిపారు వైద్యులు.. డూన్ మెడికల్ కాలేజీకి చెందిన ఫిజియాట్రిస్ట్ డాక్టర్ జయ నవానీ మాట్లాడుతూ.. ‘మాస్ హిస్టీరియా’ వంటి కేసులు స్పష్టంగా విద్యార్థుల చుట్టూ ఏర్పడే సామాజిక పరిణామాలతో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉంటాయని స్పష్టం చేశారు. ఉదాహరణకు, బూత వైద్యం అనేది కొండల భాగాలలో ఒక సాధారణ ప్రక్రియగా భావిస్తారు.. అవి పిల్లల మెదడుపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.. మరోవైపు.. డెహ్రాడూన్‌లోని విద్యా శాఖ సీనియర్ అధికారి ముకుల్ సతి మాట్లాడుతూ, భగేశ్వర్ ఘటన ఒక్కటే కదు.. చక్రతా, ఉత్తరకాశీలోని ఇతర పాఠశాల్లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు. మొత్తంగా విద్యార్థులు పూనకంతో ఊగిపోయిన ఘటన.. సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Few students in a govt school in Bageshwar dist of #Uttarakhand on Wednesday suddenly started screaming and shouting. Some beleieve it's a "mass hysteria" phenomenon. A team of doctors will visit school today. pic.twitter.com/htsFjrcC0Y
— 🐑 Anupam Trivedi / अनुपम त्रिवेदी (@AnupamTrivedi26) July 28, 2022
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!