Site icon NTV Telugu

JNU: జేఎన్‌యూ గోడలపై ‘ఫ్రీ కాశ్మీర్’, ‘భారత ఆక్రమిత కాశ్మీర్’ స్లోగన్స్.. చర్యలకు ఏబీవీపీ డిమాండ్..

Jnu

Jnu

JNU: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఈ యూనివర్సిటీ కేంద్రంగా నిలిచిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణకు కేంద్ర బింధువుగా ఉంది. తాజాగా జేఎన్‌యూ గోడలపై భారత వ్యతిరేక నినాదాలు కనిపించాయి. వీటిపై అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్‌ని డిమాండ్ చేసింది.

Read Also: Manipur: మైయిటీ విద్యార్థుల హత్య కేసు.. సీబీఐ భారీ ఆపరేషన్.. ఆరుగురి అరెస్ట్..

ఇలాంటి సంఘటనలను నివారించడంలో విఫలమవుతున్న జేఎన్‌యూ ప్రధాన భద్రతా అధికారి దీనికి బాధ్యత వహించాలని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఇటీవల జేఎన్‌యూ క్యాంపస్ గోడలపై దేశవ్యతిరేఖ నినాదాలపై విచారణ కోసం లేఖ రాసినట్లు ఏబీవీపీ ఆదివారం తెలిపింది. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇటీవ క్యాంపస్ గోడలపై ‘భారత ఆక్రమిత కాశ్మీర్’, ‘ఫ్రీ కాశ్మీర్’ ‘భగవా జలేగా’ వంటి మొదలైన నినాదాలు కనిపించాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. యూనివర్సిటీ యాజమాన్యం ఆదివారం గోడలను శుభ్రం చేసి, పెయింటింగ్ వేశారు.

Exit mobile version