NTV Telugu Site icon

Haryana: ఇదేం కల్చర్.. గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కి తీసుకెళ్తుండగా…!

Girlfrienduniversityhostel

Girlfrienduniversityhostel

దేశంలో ఎక్కడైనా బాయ్స్ హాస్టల్‌లోకి అమ్మాయిలు అనుమతి ఉండదు.. అలాగే ఉమెన్స్ హాస్టల్‌లోకి అబ్బాయిలకు అనుమతి ఉండదు. చాలా కఠినంగా నిబంధనలు అమలు చేస్తుంటారు. అలాంటిది ఒక విద్యార్థి.. గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరికీ అనుమానం తలెత్తకుండా సరికొత్త ఉపాయం ఆలోచించాడు. అంతే ఏకంగా ఒక పెద్ద సూట్‌కేసులో గర్ల్‌ఫ్రెండ్‌ను పెట్టి హాస్టల్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అతగాడి ఎత్తులు.. చిత్తులైపోయాయి. గార్డులు చాకచక్యంగా కనిపెట్టి పట్టుకున్నారు. ఈ ఘటన హర్యానాలోని ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది.

హర్యానాలోని సోనిపట్‌ ఓపీ జిందాల్ యూనివర్సిటీ. ఎప్పుడూ సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుంది. అలాంటిది ఒక విద్యార్థి.. బాయ్స్ హాస్టల్‌లోకి దొంగతనంగా ఒక అమ్మాయిని సూట్‌కేసులో పెట్టి లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. గార్డులకు అనుమానం వచ్చి చెక్ చేయగా అతగాడి బాగోతం బయటపడింది. విద్యార్థి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి సూట్‌కేసును ఓపెన్ చేయగా.. ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సమీపంలో ఉన్నవాళ్లు మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు యూనివర్సిటీ అధికారులు స్పందించలేదు.

దీనిపై నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఒకరు కామెంట్ చేయగా… అసలు సూట్‌కేసులో అమ్మాయి ఉందని ఎలా తెలిసిందో అని ఇంకొరు కామెంట్ చేశారు. ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే అమ్మాయి అదే యూనివర్సిటీ చదువుతుందా? లేదంటే బయట నుంచి వచ్చిందా? తేలాల్సి ఉంది.