Site icon NTV Telugu

Chhattisgarh: మధ్యాహ్న భోజనం తిన్న వీధి కుక్క.. 78 మంది విద్యార్థులకు రేబిస్ టీకా

Dog

Dog

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బలోడబజార్ జిల్లాలోని లాచాన్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్‌లో స్టూడెంట్స్ కోసం వండిన ఆహారాన్ని ఓ వీధి కుక్క ముట్టుకుంది. దీనిని గమనించిన విద్యార్థులు ఈ విషయాన్ని టీచర్లకు చెప్పినప్పటికీ, వారు పట్టించుకోలేదు. దీనికి తోడు ఆహారాన్ని వండిన స్వయం సహాయక బృందం (ఎస్‌హెచ్‌జీ) ఈ ఆహారం ఏమీ కలుషితం కాలేదని స్టూడెంట్స్ కు వడ్డించింది. ఇక, ఈ ఘటన వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ఎస్‌చ్‌జీ ఆ రోజు మధ్యాహ్న భోజనం చేసిన 78 మందికి యాంటీ రాబీస్ టీకాలు వేయించింది.

Read Also: Oil reserves in Pakistan: మునీర్ మిమ్మల్ని తప్పుదారి పట్టించాడు.. చమురు నిల్వలు పాకిస్తాన్‌కు చెందినవి కావు..

ఇక, ఈ ఘటన తరువాత స్టూడెంట్స్ తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాఠశాల నిర్వహణ కమిటీని ప్రశ్నించారు. ఎస్‌హెచ్‌జీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ కమిటీని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టేందుకు ఉప-డివిజనల్ మేజిస్ట్రేట్ దీపక్ నికుంజ్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నరేష్ వర్మ, ఇతర అధికారులు సదరు స్కూల్ ను సందర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఇక, ఎస్‌హెచ్‌జీ సభ్యులు అధికారుల ఎంక్వైరీలో పాల్గొనలేదు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే సందీప్ సాహు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌కి లేఖ రాశారు. ఈ వివాదంపై సమగ్రమైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version