NTV Telugu Site icon

Stray Dog Attacks: ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్కదాడి..

Dog Attack

Dog Attack

Stray dog attacks 7-year-old boy in Gujarat’s Dahod: ఇటీవల కాలంలో వీధికుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో వీధికుక్కులు అక్కడి ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో కూడా గతంలో కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే గుజరాత్ లో వీధికుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. బాలుడు ఇద్దరు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో వీధికుక్క దాడి చేసింది. ఫతేపురా గ్రామంలోని ముఖేష్ అనేబాలుడు అతని ఇద్దరు స్నేహితులు గాలిపటాలు ఎగురవేస్తుండగా వీధికుక్క అతనిపై దాడి చేసి తలపై కరిచింది.

Read Also: Plane Fight: ఏమిరా బాబు ఎందుకంత ఆవేశం.. విమానంలో పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు

కుక్కదాడి చేస్తున్న సమయంలో ముఖేష్ కేకలు వేయడంతో స్థానికులు అతడిని రక్షించారు. ఫతేపురాలోని ఓ క్లినిక్ లో ప్రథమచికిత్స అందించి.. అక్కడ నుంచి దాహోద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఒకే రోజులో గుజరాత్ రాష్ట్రంలో రెండు చోట్ల కుక్కల దాడి జరిగింది. సూరత్ లో ఇంటిముందు ఆడుకుంటున్న ఓ బాలిక వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ముఖంపై తీవ్రగాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు. కుక్క నుంచి కూతురుని రక్షించే క్రమంలో బాలిక తల్లి కూడా గాయపడింది.