NTV Telugu Site icon

West Bengal Strange Lights: ఆకాశంలో వింత.. స్పేస్‌షిప్ అంటూ జనాలు గిలిగింత

West Bengal Sky Light

West Bengal Sky Light

Strange light appears in West Bengal sky: ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఈ ప్రశ్నకు ఇంతవరకు సాక్ష్యాలతో కూడిన సమాధానం అయితే లేదు కానీ.. అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలైతే చోటు చేసుకున్నాయి. ఆకాశంలో స్పెస్‌షిప్ లాంటి వింత వాహనాలు కనిపించడం, ఆ వెంటనే మాయం అవ్వడం లాంటివి జరిగాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనూ తాజాగా అలాంటి సంఘటనే తాజాగా వెలుగు చూసింది. కాకపోతే.. ఇక్కడ స్పెస్‌షిప్ కనిపించలేదు కానీ, సుమారు ఐదు నిమిషాల పాటు వింత లైట్లు వెలిగాయి. దీంతో.. అది స్పెస్‌షిప్ అయి ఉంటుందని స్థానికులు భ్రమ పడుతున్నారు.

Man Wakes Up From Dead: నోట్లో పాలు పోశారు.. శవం లేచి కూర్చుంది

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బిష్ణుపూర్, కిర్ణాహర్, ఘటల్, ముర్షీదాబాద్‌లతో పాటు ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఈ వింత వెలుగులు కనిపించాయి. గురువారం సాయంత్రం 5:47 గంటలకు ఆకాశంలో ఈ లైట్లు ఒక్కసారిగా మెరిశాయి. ఎవరో టార్చ్‌లైట్ వేసినట్టు, ఏదో వాహనానికి సంబంధించిన హెడ్‌లైట్ మెరిసినట్లు.. ఆకాశంలో కాసేపు దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత మళ్లీ మాయం అయ్యాయి. దీంతో.. ఇది ఒక అంతుచిక్కని మిస్టీరియస్ వ్యవహారంగా మారింది. ఈ ఘటనపై కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ విభాగానికి చెందిన రాకేశ్ మజుందార్ మాట్లాడుతూ.. కాంతి తీవ్రతని బట్టి చూస్తే, ఇది అంతరిక్షం నుంచి వచ్చింది కాదని అర్థమవుతోందన్నారు.

Tragedy In Honeymoon: హనీమూన్‌లో విషాదం.. ఇంటికి తిరిగి వస్తుండగా..

‘‘ఇది భూ వాతావరణానికి చెందిన కాంతే. ఒకవేళ శాటిలైట్ పడి ఉంటే, దాన్ని కచ్ఛితంగా ట్రాక్ చేసే అవకాశం ఉండేది. పోనీ డ్రోన్ లేదా ఎయిర్‌క్రాఫ్ అయ్యున్నా.. రాడార్ దాన్ని గుర్తించేది’’ అని మజుందార్ చెప్పుకొచ్చారు. మరోవైపు.. సోషల్ మీడియాలో ఈ లైట్లపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. గురువారం సాయంత్రం ఆకాశంలో టార్చ్ లైట్ వేసినట్టు ఒక కాంతి వెలిగి, ఆ వెంటనే మాయం అయ్యిందని ఒక యూజర్ పేర్కొన్నాడు. దీని వెనుక ఆంతర్యం ఏమిటి? స్పెస్‌షిప్ ఏమైనా వచ్చిందా? అంటూ చాలామంది అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.