Site icon NTV Telugu

F-35 Fighter Jet: విడదీస్తారా, రిపేర్ చేస్తారా..? కదిలిన ఎఫ్-35 ఫైటర్ జెట్..

F 35 Fighter Jet

F 35 Fighter Jet

F-35 Fighter Jet: కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో మూడు వారాలుగా నిలిచి ఉన్న బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B స్టెల్త్ ఫైటర్ జెట్‌ ఎట్టకేలకు కదిలింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి 24 మంది నిపుణులు ఈ ఫైటర్ జెట్‌ని రిపేర్ చేయడానికి వచ్చారు. ఎట్టకేలకు 22 రోజుల తర్వాత ఈ విమానాన్ని రిపేర్ల కోసం హ్యాంగర్‌కు తరలించారు. అయితే, ఇప్పుడు నిపుణులు వీరు C-17 గ్లోబ్‌మాస్టర్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో F-35Bని ఇంటికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీనిని స్థానికంగా రిపేర్ చేయవచ్చా..? లేదా బ్రిటన్ తీసుకెళ్లడానికి కార్గో విమానంలో అమర్చడానికి విడదీయాల్సి వస్తుందా అని ఇంజనీర్లు ఆలోచిస్తున్నారు.

Read Also: Donald Trump: పుతిన్ ప్రజల్ని చంపుతూ ఉండాలనుకుంటున్నాడు..

HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగమైన బ్రిటిష్ F-35B, కేరళ తీరానికి 100 నాటికల్ మైళ్ల దూరంలో ఇండియాతో కలిసి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలో, ప్రతీకూల వాతావరణం, తక్కువ ఇంధనం కారణంగా జూన్ 14న తిరువనంతపురానికి అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చింది. భారత వైమానిక దళం ఫైటర్ జెట్ సురక్షిత ల్యాండింగ్‌కు దోహదపడింది. దీని తర్వాత, హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ ఎదురైంది. దీంతో టేకాఫ్ కావడానికి విమానం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.

Exit mobile version