Vade Bharat Express: భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ రైళ్లపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చిస్తున్నప్పటికీ.. ఆకతాయిలు వాటిని బేఖాతరు చేస్తూ, దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఆగ్రా రైల్వే డివిజన్‌లోనూ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. బుధవారం భోపాల్ నుంచి ఢిల్లీ నిజాముద్దీన్‌కు బయలుదేరిన వందేభారత్‌పై కొందరు దుండగులు ఆగ్రా రైల్వే డివిజన్ వద్ద దాడి చేయడంతో.. విండో గ్లాసులు పగిలాయి.
Imran Khan: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరోసారి సమన్లు
రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రా రైల్వే డివిజన్‌లోని మానియా, జజౌ స్టేషన్‌ల మధ్య ఈ వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో సి-7 కోచ్‌లోని సీటు నంబర్ 13-14 కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే.. ఈ దాడిలో ప్యాసింజర్లెవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఈ దాడి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్వో ఈ ఘటనపై స్పందిస్తూ.. దీనిపై విచారణ ప్రారంభించామని, నిందితులెవరో పసిగట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ దాడిలో కేవలం కిటికీ అద్దాలు పగిలాయని, ఎవరికీ ఏ హాని జరగలేదని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా, తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Bizarre Love Story: ఇదేం విడ్డూరంరా బాబు.. ఫోన్ దొంగలించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డ యువతి
కాగా.. వందేభారత్ రైలుపై ఈ తరహా దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. విశాఖపట్నంలోని కంచెరపాలెంలోనూ ఇలాగే రాళ్ల దాడి చేయగా.. రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ట్రయల్ రన్‌లో ఉండగానే ఈ దాడి జరిగింది. ఇక సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో వెళ్లే వందేభారత్ రైలుపై ఇప్పటివరకూ మూడుసార్లు దాడి జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే.. ఇప్పటివరకూ ఇలాంటి దాడులు 25 నుంచి 30 వరకు చోటు చేసుకున్నట్టు సమాచారం. దీంతో.. రైల్వే శాఖ ఈ తరహా దాడుల్ని కట్టడి చేసేందుకు కసరత్తులు చేస్తోంది.