NTV Telugu Site icon

Data Theft: 6 లక్షల మంది భారతీయుల డేటా దొంగిలించి, అమ్మకం

Deta Theft

Deta Theft

Stolen Data Of Indians Sold On Bot Markets: వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. హ్యాకర్లు ప్రజల వివరాలను సేకరించి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఈ డేటా మిస్ యూస్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద వీపీఎన్ సెరిస్ ప్రొవైడర్లలో ఒకటైన నార్డ్ వీపీఎన్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 లక్షల మంది ప్రజల డేటా దొంగిలించి బోట్ మార్కెట్ లో విక్రయించారు. కలరవరపడే విషయం ఏంటంటే.. ఒక్క భారతదేశం నుంచే 6 లక్షల మంది డేటా ఇందులో ఉంది. బోట్ మార్వెల్ ద్వారా ప్రజల డివైసెస్ నుంచి దొంగిలించిన సమాచారాన్ని విక్రయించడానికి బోట్ మార్కెట్లను హ్యకర్లు ఉపయోగిస్తుంటారు.

లిథుమేనియా నోర్డ్ సెక్యురిటీకి రెండిన నోర్డ్ వీపీఎన్ అధ్యయనం ప్రకారం.. దొంగతనానికి గురైనా డేటాలో వినియోగదారులకు సంబంధించిన లాగిన్ లు, కుకీలు, డిజిట్ ఫింగర్ ఫ్రింట్ లు, స్క్రీన్ షాట్స్ ఇతర సమాచారం ఉంది. హ్యాకర్లు ఈ డేటాను సగటున ఒక్కో వ్యక్తి సమాచారాన్ని రూ.490 రూపాయలకు అమ్ముతున్నారు. 2018లో బోట్ మార్కెట్లు ప్రారంభించినప్పటి నుంచి నోర్డ్ వీపీఎన్ డేటాను ట్రాక్ చేసింది.

Read Also: Rivaba Jadeja: భారీ విజయం దిశగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. లీడింగ్‌లో “మోర్బీ” హీరో

భారత దేశంలో గత కొంత కాలం నుంచి సైబర్ సెక్యూరిటీ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. తరుచుగా చైనా, హాంకాంగ్ నుంచి హ్యాకర్లు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వెబ్ సైట్లపై పడుతున్నారు. ఇటీవల దేశంలో అత్యంత ప్రముఖ ఆస్పత్రి అయిన ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లను హ్యక్ చేశారు. ఎయిమ్స్ పై రాన్సన్ వేర్ అటాక్ జరిగింది. నవంబర్ 30 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) 24 గంటల్లో దాదాపుగా 6 వేల హ్యాకింగ్ ప్రయత్నాలు ఎదుర్కొంది.

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) ఈ ఏడాది ప్రారంభంలోనే సైబర్ సెక్యూరిటీ నియమాలను కఠినతరం చేసింది. టెక్ కంపెనీలు ఇటువంటి సంఘటనలను గమనించిన ఆరు గంటల్లోనే నివేదించాలని కోరింది. నార్డ్ వీపీఎన్ అధ్యయనం మూడు ప్రధాన బోట్ మార్కెట్లను పరిశీలించింది. జెనెసిస్ మార్కెట్, రష్యన్ మార్కెట్, 2 ఈజీలను పరిశీలించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ ఖాతాల నుంచి దొంగిలించిన లాగిన్లను కనుక్కుంది.