NTV Telugu Site icon

Stock Market : లాభాల్లో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు..

Sensex

Sensex

నిన్న బుధవారం నష్టాల్లో బాట పట్టిన సూచీలు నేడు ఎగబాకుతున్నాయి. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం లాభాల్లో వెళ్లాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​ దాదాపు 500 పాయింట్ల లాభం పడడంతో 52 వేల 300 పైన ట్రేడ్‌ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిప్టీ 150 పాయింట్లు ఎగబాకి15 వేల 560 వద్ద లాభాలు పూయిస్తోంది. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. హీరో మోటోకార్ప్​, ఐచర్​ మోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ రాణిస్తున్నాయి. అపోలో హాస్పిటల్​, టైటాన్​ కంపెనీ, ఓఎన్​జీసీ, రిలయన్స్​ నష్టపోయాయి.

ఐటీ, ఆటో రంగాల షేర్ల దూకుడుతో మార్కెట్లు లాభాల దిశగా కొనసాగుతున్నాయి. అమెరికా, ఐరోపా మార్కెట్లు బుధవారం నష్టాలను నమోదుచేయడం గమనార్హం. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు కూడా బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 710, నిఫ్టీ 226 పాయింట్లను కోల్పోయాయి.