Hardeep Singh Puri: రాహుల్ గాంధీ 2029,2034 ఎన్నికల కోసం సిద్ధం కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Singh Puri: లోక్‌సభ ఎన్నికల అనంతరం వెలువడిని అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో ఈ సారి అధికారం మళ్లీ ఎన్డీయే కూటమిదే అని, ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వస్తున్నారని అంచనా వేశాయి. అయితే, మరోవైపు ఇండియా కూటమి 295+ స్థానాలను గెలుస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు మీడియా ఎగ్జిట్ పోల్స్ గురించి రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. ఇవన్నీ మోడీ మీడియా పోల్స్ అని తాము 295 సీట్లు సాధిస్తామని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే భారీ విజయం సాధిస్తుందని చెప్పాయి, కాంగ్రెస్ నేతలు 2029, 2034 ఎన్నికల కోసం ప్రిపేర్ కావడం మంచిదని ఎద్దేవా చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత మల్లికార్జున ఖర్గే చెప్పిన 295 సీట్ల ఫలితాలు ఆవిరైపోతాయని అన్నారు. ‘‘ ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని భావిస్తే, మరింత ఎక్కువ భ్రమలు, ఆత్మవిశ్వాసంలో మునిగిపోవడానికి మరో 48 గంటలు ఇవ్వండి. ఆపై అతను జూన్ 4న వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుంటారు’’ అని హర్దీప్ సింగ్ పూరి అన్నారు.
Also Read
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒకే దిశను సూచిస్తున్నాయని ఆయన అన్నారు. 2014, 2019 సంవత్సరాల అనుభవాన్ని ఉటంకిస్తూ, బీజేపీ 340 సీట్లకు పైగా సాధిస్తుందని తాను విశ్వసిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి కూడా ఇదే పరిస్థితి అని అన్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ.. ‘‘అతను ఇంకా యంగ్, 2029, 2034 ఎన్నికల కోసం ఎదురు చూడాలి’’ అని అన్నారు.
Read Also: Pune Porsche crash: పూణే కార్ యాక్సిడెంట్‌లో కీలక పరిణామం.. మద్యం తాగి నడిపినట్లు ఒప్పుకున్న మైనర్..
నిన్న విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 350 స్థానాల కన్నా ఎక్కువ గెలుస్తుందని అంచనా వేశాయి. 1951-52 తర్వాత వరసగా మూడోసారి రావడం ఖాయమని స్పష్టం చేశాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో ఎన్డీయే ఆధిపత్యాన్ని, కేరళలో వామపక్షాల నేతృత్వంలోని కూటమి ఓటమిని అంచనా వేసింది. బెంగాల్‌లో, ఎగ్జిట్ పోల్స్ గత సారి (22) కంటే బిజెపికి మెరుగైన పనితీరును అంచనా వేసింది. లోక్‌సభ స్థానాల పరంగా చూస్తే బెంగాల్‌లో బీజేపీ ఇప్పుడు అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయే సాధించే స్థానాలు.. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా (361 -401), న్యూస్ 24-టుడేస్ చాణక్య (400), ఎబిపి న్యూస్-సి ఓటర్ (353-383), రిపబ్లిక్ భారత్- పి మార్క్ (359), ఇండియా న్యూస్- డి-డైనమిక్స్ (371), రిపబ్లిక్ భారత్- మ్యాట్రిజ్ (353- 368), దైనిక్ భాస్కర్ (281-350), న్యూస్ నేషన్ (342-378), టైమ్స్ నౌ-ETG (358), ఇండియా TV- CNX (362-392) మరియు జన్ కీ బాత్ ( 362-392) అంచనా వేశాయి.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!