NTV Telugu Site icon

Stalin invited KCR:44వ ఫైడ్ పోటీలకు రమ్మని స్టాలిన్ ఆహ్వానం

Cm Kcr

Cm Kcr

దక్షిణాదిన తమిళనాడు సీఎంతో తెలంగాణ సీఎంకి మంచి అనుబంధం ఉంది. గతంలో అనేకమార్లు సీఎం కేసీఆర్ (K Chandrasekhar Rao)తమిళనాడుకి వెళ్లి వచ్చారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ (MK Stalin) తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఆహ్వానం పలికారు. ఈనెల జూలై 28 నుండి, 10 ఆగస్టు వరకు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, చెన్నైలో నిర్వహిస్తున్న 44 వ ఫైడ్ (FIDE) అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును తమిళనాడు సిఎం ఎం.కె.స్టాలిన్ ఆహ్వానించారు.

ఈమేరకు సిఎం స్టాలిన్ తన వారి పార్టీ రాజ్యసభ సభ్యుడు గిరిజానన్ ద్వారా శుక్రవారం ప్రగతి భవన్ కు ఆహ్వాన లేఖను పంపించారు. ఇది తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి 28 జూలై నాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా సిఎ కెసిఆర్ ను తమిళనాడు సిఎం కోరారు. ఈ సందర్భంగా డిఎంకె ఎంపీ గిరిజానన్., సిఎం కెసిఆర్ గారికి శాలువా కప్పి, జ్జాపికను అందచేసి ఆహ్వానపత్రికను అందించారు.కాగా 188 దేశాలనుంచి చెస్ క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలు, భారత దేశంలో మొదటిసారిగా, ఆసియాలో మూడోసారి జరుగుతున్నప్రతిష్టాత్మక పోటీలని లేఖలో సిఎం స్టాలిన్ పేర్కొన్నారు.

South Central Railway: ప్రయాణికులకు గమనిక.. పలు మార్గాల్లో 52 ప్రత్యేక రైళ్లు

Show comments