NTV Telugu Site icon

Maharashtra: ‘‘మహాయుతి’’లో చీలిక.. ఫడ్నవీస్, షిండేల మధ్య మరింత దూరం..?

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్ర అధికార కూటమి ‘‘మహాయుతి’’లో చీలిక కనిపిస్తోంది. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని సమావేశాలకు హాజరుకావడం లేదు. దీంతో బీజేపీ, షిండే శివసేన మధ్య చెడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ‘జనతా దర్బార్’ సోమవారం ఇరు వర్గాల మధ్య మరింత దూరాన్ని పెంచింది. శివసేన గ్రూప్ ఏక్‌నాథ్ షిండేకు బలమైన కోట అయిన థానేలో సోమవారం సాయంత్రం రెండో ‘‘జనతా దర్బార్’ కోసం ప్రణాళికలను బీజేపీ నేత, మంత్రి గణేష్ నాయక్ ప్రకటించి తర్వాత ఈ వివాదం మరింత ఊపందుకుంది.

Read Also: Gyanesh Kumar: కుంభమేళలో పాల్గొన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్.. కుటుంబ సభ్యులతో కలిసి స్నానం

ఏక్‌నాథ్ షిండే ప్రాబల్యానికి సవాల్‌ విసురుతూ, ఈ కార్యక్రమం కోసం నగరం అంతటా పోస్టర్లు, పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షిండే థానేకి గార్డియన్ మినిస్టర్‌గా ఉన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 3న నవీ ముంబైలోని వాషిలో, థానేలో దర్బార్ నిర్వహించిన గణేష నాయక్, తన కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడమే తన ఏకైక లక్ష్యమని చెప్పారు. థానే నుంచి గెలుపొందిన షిండే సేన ఎంపీ నరేష్ మస్కే మాట్లాడుతూ.. ప్రజలు తమ నాయకుడిని కలిసినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పాలి..? అని నాయక్‌కి మద్దతు ప్రకటించారు. గణేష్ నాయక్, ఏక్‌నాథ్ షిండేల మధ్య పోటీ చాలా ఏళ్ల కాలం నుంచి ఉంది. థానే, నవీ ముంబైపై ప్రభావం కోసం ఇద్దరూ పోటీ పడ్డారు.

మరోవైపు, ఇటీవల ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. తనను ‘‘తేలిక తీసుకోవద్దు’’ అని హెచ్చరించడం కూడా బీజేపీని టార్గెట్ చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2022లో ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేయడంలో తన పాత్రని బీజేపీకి గుర్తు చేశారు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ని ఎన్నుకున్నప్పటి నుంచి షిండే అసంతృప్తితో ఉన్నారు. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే, ఇప్పటికిప్పుడు ఏక్‌నాథ్ షిండే శివసేన బీజేపీని భయపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే, మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉంటే, ప్రస్తుతం బీజేపీకి 132 సీట్లు ఉంటే, మిత్రపక్షం ఎన్సీపీ-అజిత్ పవార్‌కి 41 సీట్లు ఉన్నాయి. షిండే సేనకు 57 ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా మహాయుతికి 237 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక వేళ షిండే సేన వెళ్లిపోయినా, మ్యాజిక్ ఫిగర్(145)కి ఢోకా లేదు.