NTV Telugu Site icon

Jaya Kishori: సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి క్లారిటీ

Jayakishori

Jayakishori

ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరి సోషల్ మీడియా వేదికగా ఆమె విమర్శల పాలయ్యారు. 29 ఏళ్ల వయసులోనే ఆధ్మాత్మిక బోధనలతో.. భజన పాటలతో దేశ వ్యాప్తంగా మంచి ఫేమస్ అయ్యారు. మానవ జన్మ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. డబ్బుపై వ్యామోహం ఉండకూడదని.. ఎముకల గూడుకు ఆడంబరాలు.. భోగభాగ్యాలు ఉండకూడదని బోధిస్తుంటారు. ఈమె ప్రసంగాలకు లక్షలాది మంది ఫాలోయింగ్ ఉన్నారు. తాజాగా ఎయిర్‌పోర్టులో ఆమె భక్తులకు తారసపడింది. ఆ సమయంలో ఆమె తీరును చూసిన భక్తులు అవాక్కయ్యారు. లగ్జరీ లైఫ్‌ను చూసి నిర్ఘాంతపోయారు. లగేజీ బ్యాగ్‌పై ఉన్న హ్యాండ్ బ్యాగ్ చూసి నిన్వెరపోయారు. హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ. 2లక్షలకు పైగా ఖరీదు ఉంటుంది. డియోర్ బుక్ నోట్ అనే బ్యాగ్‌పై తన పేరును కూడా రాయించుకున్నారు. అంతేకాకుండా రూ.13లక్షలకు పైగా ఖరీదైన వాచ్‌ను కూడా ధరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనాలకేమో నీతి వాక్యాలు.. తమరికేమో లగ్జరీ లైఫా? అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. మతాన్ని అడ్డంపెట్టుకుని కొందరు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తుంటారని కామెంట్ చేశారు. ఆమె మతపరమైన వక్త కంటే గ్లామరస్ అమ్మాయి అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

తాజాగా ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ అంశంపై జయ కిషోర్ మీడియాతో స్పందించారు. బ్రాండ్‌లను చూసి బ్యాగ్‌లు ఉపయోగించనన్నారు. నచ్చితే ఎక్కడికైనా వెళ్లి కొనుకోవచ్చన్నారు. తన దగ్గర కొన్ని సూత్రాలు ఉన్నాయని చెప్పారు. వాటిలో ఒకటి తోలుతో చేసినవి ఉపయోగించనని చెప్పారు. అయినా ఆ బ్యాగ్ ఎప్పుడూ ఉపయోగించలేదన్నారు. తనకు ఏదైనా నచ్చితే కొంటానన్నారు. బ్యాగ్ అనుకూలంగా ఉండడంతో కొన్నట్లు తెలిపారు. మీరు కూడా బాగా కష్టపడి డబ్బు సంపాదించాలని తాను చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నారు. మీ కుటుంబానికి సౌకర్యవంతమైన జీవితం అందించాలని తెలిపారు.