NTV Telugu Site icon

Jaipur airport: సెక్యూరిటీపై స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి దాడి.. అసలేం జరిగిందంటే..!

Dkeke

Dkeke

జైపూర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్క్రీనింగ్‌పై దగ్గర జరిగిన గొడవలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను చెప్పుతో కొట్టినందుకు స్పైస్‌జెట్ ఉద్యోగిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. స్పైస్‌జెట్ ఉద్యోగి ఎయిర్‌లైన్‌లో ఫుడ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఉద్యోగి వాహనంపై గేటు ద్వారా ఎయిర్‌పోర్టులోకి ప్రవేశిస్తుండగా.. ఆ గేటును ఉపయోగించడానికి అనుమతి లేదని ఆమెను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే స్పైస్‌జెట్ వెర్షన్ మరోలా ఉంది. స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి పట్ల భద్రతా సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని తెలిపింది. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని.. ఆమోదయోగ్యం కాని పదజాలంతో సంభాషించారని పేర్కొంది. అంతేకాకుండా డ్యూటీ వేళల ముగిశాక వచ్చి తనను కలవమని మగ ఇన్‌స్పెక్టర్‌ అడిగాడని.. దీని బట్టి మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు జరిగాయని తెలిపింది. ఇది తీవ్రమైన కేసు అని.. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉద్యోగికి అండగా ఉంటామని.. పూర్తి సహాయ సహకారం అందిస్తామని స్పైస్‌జెట్ ప్రతినిధి వెల్లడించారు.

ఇది కూడా చదవండి: అల్లుడు తిరిగొస్తే చాలు.. కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య పేరెంట్స్

వాస్తవానికి క్యాటరింగ్ వాహన ఎస్కార్ట్ స్టీల్ గేట్ నుంచి వెళ్లే అవకాశం ఉందని.. అందుకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే విమానాశ్ర పాస్‌లు ఉన్నాయని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. అయినా కూడా భద్రతా సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఆపినట్లు తెలిపారు.

 

Show comments