Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిల్ లైన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న స్కార్పియో ఓవర్‌టేక్ చేసే సమయంలో రెండు బైకులను, వెనక ఉన్న ఆటో రిక్షాను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సంఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డైంది.
Read Also: Bonda Uma: మాకేం ఇబ్బంది లేదు.. మేం 2 సీట్లు ప్రకటిస్తే.. పవన్ 2 సీట్లు ప్రకటించారు ..
సింగిల్ లైన్ రోడ్డుపై అతివేగంగా వస్తున్న స్కార్పియో, ఆటోని ఓవర్‌టేక్ చేయడానికి యత్నించింది. ఇదే సమయంలో రెండు బైకుల్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా.. మిగిలిన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంపై బీజాపూర్ గ్రామ పోలీసులు కేసు నమోదు చేశారు.
🚨🇮🇳India :—Seven people were killed in an accident in india state ,Odisha’s Borigumma earlier today.#India #accident #CCTV #Odisha #Borigumma pic.twitter.com/yrh3ljaFH9
— EUROPE CENTRAL (@europecentrral) January 26, 2024