NTV Telugu Site icon

Vande Bharat Express: వందేభారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం 130 కి.మీకి తగ్గింపు..

Vande Bharat

Vande Bharat

Vande Bharat Express: సెమీ హైస్పీడ్ రైళ్ల వేగాన్ని తగ్గిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే వరకు వందేభారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని 160 కి.మీ నుంచి 130 కి.మీకి తగ్గించారు. ప్రస్తుతం హజరత్ నిజాముద్దీన్(న్యూఢిల్లీ)- ఆగ్రా రైలు మార్గంలో ట్రాక్ పరిస్థితులు వేగానికి అనుకూలంగా ఉండటంతో ఈ మార్గంలోనే ఈ రెండు రైళ్ల గంటకు రూ. 160 కి.మీ వేగంగా నడుస్తున్నాయి.

READ ALSO: Asaduddin Owaisi: ఓవైసీ ఇంటిపై దాడి.. ‘‘జై శ్రీరాం, భారత్ మాతా కీ జై’’ నినాదాలు..

జూన్ 24న, రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సిగ్నల్) ఎన్‌సీఆర్ జోన్ జనరల్ మేనేజర్‌కి లేఖ జారీ చేసి, రైళ్ల వేగాన్ని పరిశీలించినట్లు చెప్పారు. జోనల్ రైల్వేలు IR-ATP కవాచ్ విభాగంలో పనులను వేగవంతం చేయాలని మరియు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్ పనిచేసే వరకు, రైళ్లను గరిష్టంగా 130 kmph వేగంతో నడపాలని నిర్ణయించినట్లు లేఖలో పేర్కొన్నారు. వేగాన్ని తగ్గించేందుకు రైల్వే బోర్డు మెంబర్ ఇన్‌ఫ్రా ఆమోదించినట్లు లేఖలో పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలుని వెనకనుంచి ఢీకొట్టడంతో 10 మంది మరణించిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వేగ పరిమితి జూన్ 25 నుంచి అమలులోకి వచ్చింది. న్యూఢిల్లీ-రాణి కమలాపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్-ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, న్యూ ఢిల్లీ-విరాంఘానా ఝాన్సీ గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌ల గురించి లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Show comments