Site icon NTV Telugu

JK Forest: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్ర స్థావరంపై స్పెషల్ పోలీసుల దాడులు.. ఆయుధాలు స్వాధీనం

Jk Forest

Jk Forest

జమ్ముకాశ్మీర్ అటవీ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ బృందం దాడులు నిర్వహించింది. ఒక ఉగ్రవాద స్థావరంపై దాడి చేసింది. ఉగ్రవా ద స్థావరంలో రైఫిల్, 22 లైవ్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో మరోసారి భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా భావిస్తున్నారు. స్పెషల్ పోలీసుల దాడితో దేశ వ్యతిరేక శక్తుల కుట్ర బయటపడింది.

ఇది కూడా చదవండి: PM Modi: పార్లమెంట్‌లో నేడు ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న మోడీ

జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) థాత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని భలారా అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద విజయాన్ని సాధించినట్లుగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్ ఎస్ఎస్‌పీ దోడా సందీప్ మెహతా పర్యవేక్షణలో జరిగింది. పక్కా సమాచారం మేరకు ఈ దాడి నిర్వహించారు. అటవీ ప్రాంతంలో గాలింపు చేస్తుండగా ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, 22 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Thailand-Cambodia War: మరోసారి కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. వైమానిక దాడులతో టెన్షన్

అయితే ఆయుధాలు ఎవరు దాచి పెట్టారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారకులు ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగా దర్యాప్తు జరుగుతోంది. నవంబర్‌లో ఇదే ప్రాంతంలో దాడులు నిర్వహించారు. కానీ అప్పుడు బయటపడని ఆయుధాలు.. తాజాగా బయటపడడంతో ఏదో కుట్ర జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు.

Exit mobile version