Special Parliament session: కేంద్రం సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లోనే కొత్త పార్లమెంట్ కు సభ తరలివెళ్లనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బంది, ఉద్యోగులకు ప్రత్యేక యూనిఫాం ధరించనున్నారు. పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా ఈ డ్రెస్ కోడ్ ఉండనుంది. నెహ్రూ జాకెట్స్, ఖకీ ప్యాంట్స్ ఇలా యూనిఫాంలో పలు మార్పులు రానున్నాయి. సెప్టెంబర్ 18న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతుండగా.. 19న వినాయక చతుర్థి రోజున కొత్త పార్లమెంొట్ భవనంలోకి లాంఛనంగా సభ ప్రవేశించననుంది.
ప్రస్తుత యూనిఫాంలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) రూపొందించింది. బ్యూరోక్రాట్లకు బంద్‌లాగా సూట్ స్థానంలో పింక్ కలర్ నెహ్రూ జాకెట్ రానుంది. షర్ట్స్ కూడా పింక్ కలర్, లోటస్ ఫ్లవర్ డిజైన్ తో ఉంటాయి. ఉద్యోగులు ఖాకీ రంగు ప్యాంటు ధరిస్తారు. ఇక మార్షల్స్ దస్తులను కూడా మార్చారు. ఇకపై వారు మణిపూర్ తలపాగాలను ధరిస్తారు. పార్లమెంట్ భవనంలోని భద్రతా సిబ్బంది దస్తులను కూడా మార్చనున్నారు. సఫారీ సూట్ కు బదులుగా మిలిటరీ తరహా దుస్తులు ఉండనున్నాయి.
Read Also: India vs Sri Lanka: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. మరో 22 పరుగులే!
కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చినా.. ఇప్పటి వరకు ఎజెండా ఏమిటో తెలియదు. అయితే ఈ సమావేశాల్లో ఇండియా పేరును భారత్ గా మారుస్తారని, వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లులను తీసుకువస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జీ 20 సమావేశాల్లో రాష్ట్రపతి విందుకు సంబంధించిన నోట్ లో ‘‘ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ బదులుగా ‘‘ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’ అని ఉండటంతో పాటు జీ20 సమావేశాల్లో ప్రధాని మోడీ ముందు ఉన్న నేమ్ ప్లేట్ పై దేశం పేరు భారత్ అని రాసి ఉండటం ఈ అనుమానాలకు తావిస్తున్నాయి.
