నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి… ముందుగా అంచనా వేసిన ప్రకారం జూన్ 1వ తేదీకి రెండు రోజులు ఆసల్యంగా కేరళలను తాకాయి రుతుపవనాలు.. ఇవాళ ఉదయం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.. ఈ నెల 1వ తేదీనే రుతుపవనాలు రావాల్సి ఉండగా.. రెండు రోజులు ఆలస్యంగా వచ్చినట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర వెల్లడించారు.. వీటి ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు.. కాగా, గాలి వేగం, వర్షపాత స్థిరత్వం, తీవ్రత, మేఘాలు ఆవరించడాన్ని బట్టి రుతపవనాల రాకను వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది.. గత మూడు నాలుగు రోజుల నుంచి కేరళలో వర్‌సాలు కురుస్తున్నా.. నైరుతి రుతుపవనాలు ఇవాళ ప్రవేశించినట్టు ఐఎండీ వెల్లడించింది.. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. మొదట ఏపీలోకి ప్రవేశించిన తర్వాత క్రమంగా తెలంగాణలోకి విస్తరించనున్నాయి నైరుతి రుతుపవనాలు.
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
monsoon