Site icon NTV Telugu

Pushkar Firing: సినిమాని మించిన ఉదంతం.. 31 ఏళ్ల తర్వాత ప్రతీకారం

Pushkar Firing

Pushkar Firing

Sons Avenged Father Killed 31 yrs Ago For Writing On Girls Harassments: రాజస్థాన్‌లోని పుష్కర్‌లో సినిమాని మించిన ఉదంతం చోటు చేసుకుంది. తమ తండ్రి మృతికి కారణమైన ఒక వ్యక్తిని.. 31 ఏళ్ల తర్వాత కాల్చి చంపి, ప్రతీకారం తీర్చుకున్నారు తనయులు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అది 1992. ఆ రోజుల్లో అజ్మీర్‌లో స్కూలు, కాలేజీ విద్యార్థినులపై అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. అప్పట్లో ఓ వారపత్రికని నడిపిన మదన్ సింగ్ అనే వ్యక్తి.. నాటి అరాచకాలపై కథనాలు రాశారు. అమ్మాయిలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో.. ఏమాత్రం బిడియం లేకుండా నిందితుల పేర్లను వివరంగా తన కథనాల్లో పేర్కొన్నారు. దాంతో ఆయనపై కొందరు దుండగులు కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా అతడ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఒక పక్కా ప్లాన్ వేసుకున్నారు.

ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ద్వీపాలు.. వెళ్తే ఫసక్

తమ ప్లాన్ ప్రకారం.. శ్రీనగర్ రోడ్‌లో మదన్ సింగ్ రాగానే, ఆయనపై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన.. జెఎల్ఎన్ ఆసుపత్రిలో చేరారు. తమ దాడిలో మదన్ సింగ్ బతికి బయటపడ్డాడని తెలుసుకున్న దుండగులకి మరింత భయం పట్టుకుంది. అతడు కోలుకుంటే, తమ జీవితాలు ఇక నాశనం అవుతాయని ఆందోళన చెందారు. దాంతో.. మదన్ సింగ్ కోలుకోక ముందే ఆసుపత్రిలోనే మట్టుబెట్టాలని పథకం రచించారు. ప్లాన్ వేసుకున్నట్టుగానే ఆసుపత్రిలో చొరబడి, మరోసారి మదన్‌పై దాడి చేశారు. ఈసారి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితులైన సవాయ్ సింగ్, రాజ్ కుమార్ జైపాల్, నరేంద్ర సింగ్‌లను అరెస్ట్ చేశారు. ఈ హత్య జరిగిన సమయంలో మదన్ సింగ్ కుమారులు ధర్మ (12), సూర్య (8) చిన్నవాళ్లు. ఇప్పుడు వాళ్లు పెరిగి పెద్దయ్యారు.

Robber Gun Fire: ఫేక్ తుపాకీతో వెళ్లాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు

కట్ చేస్తే.. మదన్ సింగ్‌ను హత్య కేసులో నిందితులైన సవాయ్ సింగ్, రాజ్ కుమార్ జైపాల్‌ను కోర్టు 2012లో నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేసింది. ఈ తీర్పుని జీర్ణించుకోలేకపోయిన మదన్ కుమారులు ధర్మ, సూర్య.. తమ తండ్రి హత్యకు కారకులైన వారిని చంపాలని ఫిక్స్ అయ్యారు. తన కుమారుడి పెళ్లి ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు సవాయ్ సింగ్ ఒక రిసార్ట్‌కి వెళ్లినప్పుడు.. ధర్మ, సూర్య కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సవాయ్ సింగ్‌తో పాటు దినేశ్ తివారీ అనే మరో వ్యక్తి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో పోలీసులు సూర్యని అరెస్ట్ చేయగా.. ధర్మ తప్పించుకొని పారిపోయాడు. కాగా.. సూర్య, ధర్మలపై కూడా గతంలో చాలా కేసులున్నాయని పోలీసుల విచారణలో తేలింది. వాళ్లు దోపిడీ, బెదిరింపులు, ల్యాండ్ మాఫియా వ్యవహారాలకు పాల్పడ్డారని వెల్లడైంది.

Exit mobile version