Site icon NTV Telugu

Sonia Gandhi: గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ దురదృష్టకరం.. తల్లి అభిప్రాయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసిన రాహుల్‌గాంధీ

Sonia Gandhi

Sonia Gandhi

గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ ఒక దురదృష్టకర సంఘటన అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘‘నికోబార్‌లో పర్యావరణ విపత్తును సృష్టించడం’’ అనే శీర్షికతో ది హిందూలో ప్రచురితమైన ఒక కథనాన్ని రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Haryana: ఫరీదాబాద్‌లో ఘోరం.. ఏసీ పేలి ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటు కుక్క మృతి

మోడీ ప్రభుత్వం రూ.72,000 కోట్లతో ‘‘గ్రేట్ నికోబార్ సమగ్ర అభివృద్ధి’’ ప్రాజెక్ట్ చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను సోనియాగాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆమె అభిప్రాయాన్ని ది హిందూ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అదే కథనాన్ని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Heavy Rains : 14 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

సోనియా వ్యాసం.. 

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కారణంగా పర్యావరణమే కాకుండా జీవితాలు.. పెట్టుబడులు ప్రమాదంలో పడేస్తాయని సోనియాగాంధీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గిరిజన హక్కులను తుంగలో తొక్కినట్లే అవుతుందని.. అంతేకాకుండా చట్టాన్ని కూడా అపహాస్యం చేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ కారణంగా నికోబారీలను శాశ్వతంగా స్థానభ్రంశం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. 2004లో సునామీ కారణంగా వీళ్లంతా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని… తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ ఇప్పుడు శాశ్వతంగా రాకపోవచ్చని చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్‌తో నికోబార్ లాంగ్-టెయిల్డ్ మకాక్, సముద్ర తాబేళ్లు, స్థానిక వన్యప్రాణాలు పూర్తిగా అంతరించిపోతాయని స్పష్టం చేశారు. భూకంపాలు సంభవించే దగ్గర భారీ ప్రాజెక్ట్‌లు చేపట్టడం వల్ల ఏ ప్రయోజనం ఉందని వెల్లడించారు. దీని కారణంగా పర్యావరణం దెబ్బతినడమే కాకుండా పెట్టుబడులు కూడా ప్రమాదంలో పడినట్లేనని వివరించారు. ఇక 8.5 లక్షల నుంచి 58 లక్షల వరకు చెట్లు నరికి వేస్తారని.. దీంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతినడం ఖాయంగా వివరించారు.

వాస్తవంగా అక్కడ చేపట్టే ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణానికి నష్టమేనని కమిటీ చెప్పిందని.. కాకపోతే అధిక శక్తి కలిగిన నేతలు ఆ కమిటీ రిపోర్టును తారుమారు చేశారని ఆరోపించారు. కమిటీ రిపోర్ట్‌ను ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందని సోనియాగాంధీ తన వ్యాసంలో పిలుపునిచ్చారు.

 

Exit mobile version