Site icon NTV Telugu

Sonia Gandhi: గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు

Soniagandhi

Soniagandhi

గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఈ పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియాగాంధీ ఆరోపించారు. బుధవారం సోనియాగాంధీ రాజ్యసభలో ప్రసంగించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, గర్భిణీ స్త్రీల పథకంపై ప్రసంగించారు. బిడ్డకు జన్మినిచ్చిన తల్లికి రూ.6 వేలు ప్రసూతి ప్రయోజనాలు అందుతాయని.. ఇవి రెండు విడతలుగా చెల్లిస్తారన్నారు. రెండోసారి ఆడబిడ్డ అయితే ఈ పథకం వర్తిస్తుందన్నారు. కానీ ప్రస్తుతం ఈ పథకం కుంటుపడిందని.. దీనికి నిధులే లేవని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Rajendra Prasad : హే ‘రాజేంద్ర ప్రసాద్’ ఏ క్యా హువా

జాతీయ ఆహార భద్రతా చట్టం అమలుకు రూ.12,000 కోట్లు అవసరం అన్నారు. కానీ రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే కేటాయించారని సభ దృష్టికి సోనియా తీసుకొచ్చారు. ఇక గర్భిణీ స్త్రీలకు రెండు విడతలుగా అందాల్సిన నగదు అందడం లేదన్నారు. 2022-23లో 68 శాతం మందికే ఒక విడత డబ్బులే అందాయని.. అనంతరం ఆ నిష్పత్తి బాగా తగ్గిపోయిందన్నారు. క్రమక్రమం ఆ నిష్పత్తి పూర్తిగా పడిపోతూ వచ్చిందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Sugar Levels: జొన్న రొట్టెలు తింటే డయాబెటిస్ తగ్గుతుందా?

Exit mobile version