NTV Telugu Site icon

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీ అసంతృప్తి 

ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ  సమావేశం ఢిల్లీ జరిగింది.  వర్చువల్ విధానం ద్వారా ఈ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలపై సోనియా గాంధీ ఫైర్ అయ్యారు.  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధినేత్రి సోనియా అసంతృప్తిని వ్యక్తం చేశారు.  ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల పనితీరుపై ఆమె మండిపడ్డారు.  అదే విధంగా ఈ సమావేశంలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, వ్యాక్సిన్, లాక్  డౌన్ తదితర అంశాలపై కూడా చర్చిస్తున్నారు.  ఈ సమావేశంలో కొత్త అధ్యక్షుడి గురించి కూడా చర్చించబోతున్నారని సమాచారం.