Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్‌గాంధీతో ప్రేమ ముచ్చట్లు
- త్వరలో సోనియాగాంధీ ఆత్మకథ
- ‘బిలాంగింగ్’ పేరుతో స్వీయచరిత్ర
- రాజీవ్‌గాంధీతో ప్రేమ ముచ్చట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియాగాంధీ.. ఈ పేరుకో గుర్తింపు ఉంది. వివరాలు చెప్పకుండానే భారతీయులకు గుర్తుకొచ్చే పేరు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీల తల్లిగా.. రాజీవ్‌గాంధీకి భార్యగా.. ఇందిరాగాంధీ కోడలిగా పేరు ప్రఖ్యాతలు కలిగిన నేత సోనియాగాంధీ. ఇప్పుడు ఆమె ఆత్మకథ రాబోతుంది. ఇటలీలో బాల్యం.. రాజీవ్‌గాంధీతో ప్రేమ.. ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం. సంజయ్ గాంధీ మరణం.. ఇందిరాగాంధీ హత్య.. ఇలా ఎన్నో సంగతులు.. ‘బిలాంగింగ్’ పేరుతో వస్తున్న పుస్తకంలో రాబోతున్నాయి. పెంగ్విన్ ప్రచురించిన 544 పేజీలు కలిగిన ఆత్మకథ నవంబర్ 10న ప్రజల ముందుకు రానుంది.
బాల్యం నుంచి రాజకీయ ప్రయాణం వరకు..
పెంగ్విన్ పబ్లికేషన్స్ ప్రకారం.. ఆత్మకథ పుస్తకంలో సోనియా గాంధీ 1965లో కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీతో తన మొదటి సమావేశాన్ని వివరించారు. అప్పుడు ఆమె 19 ఏళ్ల విద్యార్థిని. ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అటు తర్వాత సోనియాగాంధీ భారతదేశానికి వచ్చారు. తొలిరోజుల అనుభవాలను, భారతీయ జీవనశైలికి అలవాటుపడటం, హిందీ నేర్చుకోవడం, చీరలు ధరించడం, భారతీయ ఆహారానికి అలవాటుపడటం వంటి విషయాలను వెల్లడించారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
పుస్తకంలో ఏముంది?
ఆత్మకథలో ఇందిరా గాంధీతో ఆమె తొలి భేటీ.. గాంధీ కుటుంబంతో ఆమె జీవితం గురించి అనేక అధ్యాయాలు ఉన్నాయి. అలాగే విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం, 1984లో ఇందిరా గాంధీ హత్య, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే వరకు జరిగిన సంఘటనలను కూడా వివరంగా ఉన్నాయి. 1991లో తన ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయాన్ని కూడా సోనియా గాంధీ ప్రస్తావించారు.
రాజీవ్ గాంధీ మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఒత్తిడిని ఆమె చాలా కాలం పాటు తిరస్కరించారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి.. అత్యధిక కాలం అధ్యక్షురాలిగా ఎలా పనిచేశారో కూడా ఈ పుస్తకంలో వివరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పదవికి ఎంపిక చేసిన విధానం.. అనంతరం ఆ పదవిని తిరస్కరించి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీని ఎలా నడిపించారో కూడా ఉన్నాయి. స్వాతంత్ర్యానంతర భారతదేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పులను కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. గాంధీ ఫ్యామిలీ గురించి భారతీయులకు తెలియని ఎన్నో విషయాలు సోనియాగాంధీ తెలియజేశారు. ఈ విషయాలన్నీ తెలియాలంటే మరో 3 నెలలు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!