Sonam Wangchuk: పర్యావరణ కార్యకర్త, లడఖ్ రాష్ట్ర హోదాకు డిమాండ్ చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను శుక్రవారం పోలీసుల అరెస్ట్ చేశారు. రాష్ట్ర హోదా కోరుతూ, రెండు రోజుల క్రితం లడఖ్ వ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ముఖ్యంగా, అధికారులు, బీజేపీ కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ వాహనాన్ని తగలబెట్టారు. అందులో ఒక సీఆర్పీఎఫ్ సిబ్బందిని కాల్చే ప్రయత్నం చేశారు. ఈ అల్లర్లు జరిగిన రెండు రోజుల తర్వాత, అల్లర్లను ప్రేరేపించిన కారణంగా సోనమ్ వాంగ్‌చుక్‌ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసి అల్లర్లకు కారణమయ్యాడని అరెస్ట్ చేశారు. దీనికి ముందు, ఈ కారణాల వల్ల తనను అరెస్ట్ చేస్తే ఆనందంగా ఉంటుందని వాంగ్‌చుక్ చెప్పిన ఒక రోజు తర్వాత ఆయన అరెస్ట్ జరిగింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆయన నడుపుతున్న ఎన్జీవో సంస్థ, విదేశీ విరాళాల సేకరణలో FCRA నిబంధనల్ని ఉల్లంఘించిందని చెబుతూ, దాని రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం రద్దు చేసింది.
