Site icon NTV Telugu

Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ కేసులో పాకిస్తాన్ కోణం.. దర్యాప్తులో సంచలన విషయాలు..

Sonam Wangchuk

Sonam Wangchuk

Sonam Wangchuk: బుధవారంలో లడఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ హింసాత్మక అల్లర్లు జరిగాయి. ఈ ఆందోళనల్లో నలుగురు మరణించడంతో పాటు 50కి పైగా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆందోళనకారులతో పాటు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఉన్నారు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టడంతో పాటు, భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. అయితే, ఈ హింసను ప్రేరేపించేలా చేశాడని లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై కేంద్ర ప్రభుత్వం కేసు పెట్టింది.

సోనమ్ వాంగ్‌చుక్ ఎన్జీవోల విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించిందని, ఎఫ్‌సీఆర్ఏ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా ఆయన సంస్థల రిజస్ట్రేషన్లను కేంద్రం రద్దు చేసింది. గురువారం, అల్లర్లకు ప్రేరేపించిన కారణంగా అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సోనమ్ వాంగ్‌చుక్‌ దర్యాప్తులో పాకిస్తాన్ కోణం బయటపడింది.

Read Also: Natural gas: జాక్‌పాట్ కొట్టిన భారత్.. అండమాన్‌లో భారీగా ‘‘సహజ వాయువు’’

లడఖ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఎస్డి సింగ్ జామ్వాల్ ఈ మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వాంగ్‌చుక్ పాకిస్తాన్ పర్యటల్ని ప్రశ్నించారు. వాంగ్‌చుకు పాకిస్తాన్ డాన్ నిర్వహించిన పర్యావరణ కార్యక్రమానికి హాజరయ్యారని, చర్చల్ని దెబ్బతీసేలా చేస్తున్నారని డీజీపీ ఆరోపించారు. ‘‘ఇటీవల మేము ఒక పాకిస్తాన్ పీఐఓను అరెస్ట్ చేశాము. అతడితో వాంగ్‌చుక్‌కు సంబంధాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన రికార్డులు మా వద్ద ఉన్నాయి. అతను పాకిస్తాన్ వెళ్లాడు, బంగ్లాదేశ్ కూడా వెళ్లాడు. అతడి కదలికలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి’’ అని చెప్పారు.

సోనమ్ వాంగ్‌చుక్‌పై కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద అభియోగాలు మోపారు. దీని వల్ల బెయిల్ అవకాశం లేకుండా దీర్ఘకాలం నిర్భంధంలో పెట్టవచ్చు. ఆయనను అరెస్ట్ చేసి, రాజస్థాన్ జోధ్‌పూర్‌ లోని ఒక కేంద్రానికి మార్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లేహ్‌లో కర్ఫ్యూ విధించడంతో పాటు తప్పడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఇంటర్నెల్ సేవల్ని నిలిపేశారు. అల్లర్లకు ముందు వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. ‘‘అరబ్ స్ప్రింగ్స్’’, నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించాడు. వీటిలో ఆందోళనకారులు రెచ్చిపోయి హింసకు పాల్పడ్డారు.

Exit mobile version