NTV Telugu Site icon

Sonali Phogat Case: బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ హత్య కేసులో డ్రగ్ డీలర్ తో సహా మరొకరి అరెస్ట్

Sonali Phogat

Sonali Phogat

Sonali Phogat Case: Club Owner, Drug Dealer Arrested: దేశవ్యాప్తంగా బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగాట్ హత్య కేసు చర్చనీయాంశంగా మారింది. ముందుగా గుండె పోటుతో మరణించిందని.. అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ తర్వాత హత్య కోణం వెలుగులోకి వచ్చింది. గోవాలో ఉన్న సమయంలో ఆమె అనుమానాస్పదంగా మరణించింది. అయితే ఈ మరణంపై ఆమె సోదరుడు రింకూ ఢాకా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా ఆమె శరీరంపై మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు తేల్చింది. దీంతో ఆమె మరణాన్ని హత్యగా కేసు నమోదు చేశారు గోవా పోలీసులు. రింకూ ఢాకా, సోనాలి ఫోగాట్ సహాయకులు సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ వాసీలపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Read Also: What is The BJP Plan: ఎన్టీఆర్‌తో సరే..! నితిన్‌ ఎందుకు..? బీజేపీ ప్లాన్‌ అదేనా..?

అయితే ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమె మరణానికి ముందు రోజు పార్టీ జరిగిన గోవా రెస్టారెంట్ యజమానితో సహా.. డ్రగ్ డీలర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో అరెస్టుల సంఖ్య నాలుగుకు చేరింది. ఫోగట్ సోమవారం రాత్రి గోవాలోని అంజునా బీచ్ లోని కర్లీన్ రెస్టారెంట్ కమ్ నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంది. ఆ సమయంలోనే సుఖ్వీందర్ సింగ్, సుధీర్ సంగ్వాన్ ఇద్దరు బలవంతంగా ఆమె చేత సింథటిక్ డ్రగ్ తాగించారు. ఆ తరువాత ఆమెను ఓ టాయిలెట్ లోకి తీసుకెళ్లి రెండు గంటలు ఉంటారు. తెల్లవారు మంగళవారం సోనాలీ మరణించి కనిపించింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ లు బయటకు వచ్చాయి.

ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవా ఐజీపీ ఓం వీర్ సింగ్ బిష్ణోయ్ ప్రకారం సోనాలీ ఫోగాట్ కు సింథటిక్ డ్రగ్ ఇచ్చారని.. అయితే అందులోని పదార్థం ఏంటనేది తెలియలేదని వెల్లడించారు. ఈ పదార్థాని బలవంతంగా తాగించిన తర్వాత రెండు గంటల పాటు టాయిలెట్ లోకి సుఖ్వీందర్ సింగ్, సుధీర్ సంగ్వాన్ తీసుకెళ్లారని.. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. హర్యానాకు చెందిన సోనాలీ ఫోగాట్ 2008లో బీజేపీలో చేరారు. 2019 హర్యాన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.