NTV Telugu Site icon

Arvind Kejriwal: హిరణ్యకశిపుడి లాగే కొంతమంది దేవుడిలా అనుకుంటున్నారు.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఆప్ నాయకులు బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్రాన్ని రాక్షస రాజు హిరణ్యకశిపుడితో పోల్చారు. పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుపించారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. కొంతమంది తమను తాము హిరణ్య కశ్యపుడిలా భావించుకుంటూ తమను తాము దేవుడిలా అనుకుంటున్నారని విమర్శించారు.

Read Also: PM Narendra Modi: ఆస్ట్రేలియా ప్రధానితో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన మోదీ..

దేశానికి, పిల్లలకు సేవ చేసిన ప్రహ్లాదుడి వంటి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని అన్నారు. హిందూ పురాణాల్లో హిరణ్యకశిపుడి, ప్రహ్లదులు, విష్ణుభగవాడుని కథను గుర్తు చేస్తూ విమర్శించారు. అప్పుడు ప్రహ్లాదుడిని ఆపలేకపోయారు. ఇప్పుడు కూడా ఆపలేరని కేజ్రీవాల్ అన్నారు.

లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన తర్వాత 10 రోజుల కస్టడీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరింది. ఈ సమయంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తీహార్ జైలులో మనీష్ సిసోడియా విచారణ సాగుతోంది. విచారణ అనంతరం ఈడీ ఆయన అరెస్ట్ కోరింది. గత నెల ఫిబ్రవరి 26న సీబీఐ సిసోడియాను అరెస్ట్ చేసింది. మార్చి 20 వరకు కస్టడీకి అప్పగించింది కోర్టు. ఈ కేసులో ఆప్, బీజేపీల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి.