NTV Telugu Site icon

Kiren Rijiju: సుప్రీంకోర్టు కన్నా బీబీసీనే ఎక్కువా..? మోదీ డాక్యుమెంటరీపై కేంద్రమంత్రి

Kiren Rijiju

Kiren Rijiju

BBC Documentary on Modi: భారతదేశంలో కొంతమంది సుప్రీంకోర్టు కన్నా బీబీసీనే ఎక్కువ అని భావిస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కొంతమందిని సంతోషపెట్టడానికి ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని.. వారు దేశ గౌరవాన్ని, ప్రతిష్టను ఏ స్థాయిలో అయినా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్రమోదీపై పాత్ర ఉందని చెబుతూ.. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది వలసవాద మనస్తత్వాన్ని కలిగి ఉందని భారత విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది.

Read Also: Bihar Car Accident: ఢిల్లీ తరహా మరో హారర్ ఘటన.. 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..

ఇదిలా ఉంటే కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, కొంతమంది ఈ డాక్యుమెంటరీని ఆధారంగా చేసుకుని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీలు సానుకూలంగా ముందుకు సాగుతున్నారని రిజిజు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. భారతదేశం లోపల, వెలుపల ఇలాంటి ప్రచారాల ద్వారా భారత ప్రతిష్టను కించపరచలేరని.. ప్రధాని 140 కోట్ల భారతీయుల స్వరం అని రిజిజు ట్వీట్ చేశారు.

భారతదేశంలో కొంతమంది ఇప్పటికీ వలస పాలన నుంచి బయటపడలేదని..బీబీసీని భారత సుప్రీంకోర్టు కన్నా ఎక్కువగా భావిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తుక్డే తుక్డే గ్యాంగ్ వారి నుంచి ఇంకేం ఆశించలేదనమని.. వారి ఆశ భారతదేశాన్ని బలహీన పరచడం అని అన్నారు. అంతకుముందు 300 మంది దాకా మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు బీబీసీకి వ్యతిరేకంగా మోదీకి మద్దతుగా ఓ లేఖను విడుదల చేశారు.