Bihar Car Accident: ఢిల్లీ తరహా మరో హారర్ ఘటన.. 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Drags 70 year Old On Cars Bonnet For 8KM In Bihar Crushes Him To Death: న్యూఇయర్ సందర్భంగా.. ఢిల్లీలో అంజలి సింగ్ అనే యువతిని ఓ కారు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అలాంటిదే బిహార్‌లో చోటు చేసుకుంది. అయితే.. ఈ ప్రమాదంలో తొలుత మృతుడు కారు ముందు భాగం బానెట్‌పై పడిపోయాడు. ఒకవేళ డ్రైవర్ తన కారుని ఆపి ఉంటే, ఆయన బ్రతికేవాడు. కానీ.. నిందితుడు తన కారుని ఆపకుండా ర్యాష్‌గా వెళ్లిపోయాడు. అనంతరం ఆ వ్యక్తిపై నుంచి వెళ్లిపోవడంతో.. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. బిహార్‌లోని చంపారన్ జిల్లా జాతీయ రహదారిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Road Accidents: రోడ్డు ప్రమాదాలు పెరగడానికి రోడ్లు బాగుంటమే కారణం.. బీజేపీ ఎమ్మెల్యే విశ్లేషణ
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
బాంగ్రా గ్రామానికి చెందిన శంకర్ చౌధర్ (70) అనే ఓ వృద్ధుడు ఎన్‌హెచ్27 రహదారిపై సైకిల్‌పై వెళ్తున్నాడు. బాంగ్రా చౌక్ సమీపంలోని ఆయన రహదారిని దాటుతుండగా.. గోపల్‌గంజ్ పట్టణం నుంచి అతివేగంగా వచ్చిన కారు ఆయన్ను ఢీకొట్టింది. ఈ ఘటనపై వృద్ధుడు ఆ కారు బానెట్‌పై పడిపోయాడు. అది చూసి కూడా.. డ్రైవర్ తన కారు ఆపకుండా నిర్లక్ష్యంగా పోనిచ్చాడు. అలా 8 కిలోమీటర్ల వరకు ఆ వృద్ధుడిని ఈడ్చుకెళ్లాడు. అనంతరం సడెన్ బ్రేక్ వేసి, ఆ వృద్ధుడు కిందపడిపోయేలా చేశాడు. కనీసం అప్పుడైనా ఆ డ్రైవర్ మానవత్వం ప్రదర్శించకుండా.. ఆ వృద్ధుడు తనపై కేసు పెడతాడేమోనన్న భయంతో, ఆయనపై నుంచే కారుని తీసుకెళ్లిపోయాడు. దీంతో.. ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు.
Shoaib Akhtar: బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా.. తీస్తే కఠిన చర్యలు తప్పవు
చుట్టుపక్కల స్థానికులు ఈ ఘటనని గమనించి, ఆ కారుని ఆపేందుకు ప్రయత్నించారు. కొందరు ఆ కారుని వెంబడించారు కూడా! కానీ ఆ డ్రైవర్ మరింత స్పీడ్‌గా కారుని పోనివ్వడంతో.. అతడు చేతికి చిక్కలేదు. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులు సమాచారం అందించగా.. వాళ్లు వెంటనే రంగంలోకి దిగి, ఆ కారుని పిప్రకోఠి సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఆ కారులో ఉన్న డ్రైవర్‌తో పాటు ఇతరులు సైతం పరారైనట్టు సమాచారం. ఆ కారు యజమానిని ట్రేస్ చేసి, ఈ ఘటన గురించి విచారిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Himanta Biswa Sarma: నిన్న షారుఖ్ తెలియదన్నారు.. ఈరోజు ఫోన్‌లో మాట్లాడారు
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!