Site icon NTV Telugu

Himachal Pradesh: ఓ వీరుడి సోదరి వివాహాన్ని జరిపించిన సైనికులు.. అతిథులు కన్నీటిపర్యంతం

Marriage2

Marriage2

హిమాచల్‌ప్రదేశ్‌లో భారతీయ సైనికులు ఒక గొప్ప కార్యక్రమానికి పూనుకున్నారు. ఒక వీరుడి సోదరి వివాహం కోసం సైనికులంతా కదిలివచ్చారు. దేశం కోసం వీరమరణం పొందిన ఒక సైనికుడి సోదరి వివాహాన్ని దగ్గరుండి గ్రాండ్‌గా నిర్వహించారు. దీంతో పెళ్లికొచ్చిన అతిథులంతా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: UP: సినిమా రేంజ్‌లో కాల్పులు.. హత్య దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్

ఆశిష్ కుమార్ అనే సైనికుడు యుద్ధంలో మరణించాడు. ఫిబ్రవరి 2024లో ఆపరేషన్ అలర్ట్ సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆశిష్ కుమార్ యుద్ధంలో మరణించాడు. అయితే ఆశిష్ కుమార్ సోదరి వివాహం నిశ్చయమైంది. దీంతో ఆశిష్ కుమార్ పాత్రను సైనికులు బాధ్యత తీసుకున్నారు. పాంట, షిల్లాయ్ నుంచి వచ్చిన సైనికులు, మాజీ సైనికులు సోదరుడి పాత్రను పోషించారు. గ్రాండ్‌గా పెళ్లికూతురిని వివాహ మండపానికి తీసుకొచ్చారు. ఇక పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. వివాహానికి వచ్చిన అతిథులంతా ఆశ్చర్యపోయారు. మరికొందరు కన్నీటిపర్యంతం అయ్యారు.

ఇది కూడా చదవండి: Scuba Diving: స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్.. ఎలాగంటే..!

ఇక ఆశిష్ కుమార్ తరపున సైనికులంతా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను పెళ్లి కూతురికి బహుమతిగా ఇచ్చారు. సుఖ సంతోషాలతో కలకాలం జీవించాలని నూతన దంపతులను ఆశీర్వదించారు. సోదరుడి తరపున సైనికులు చేసిన పనికి వధువుతో పాటు ఆమె అత్తమామలు ఆనందభాష్పాలు చిందించారు. అనంతరం అత్తగారింట్లో కూడా సైనికులు సోదరుడి పాత్రను పోషించి వెళ్లిపోయారు.

Exit mobile version